వీర జవాన్ ఎక్కడున్నాడు? | Can YOU spot the camouflaged Marine in this video? | Sakshi
Sakshi News home page

వీర జవాన్ ఎక్కడున్నాడు?

Published Wed, Feb 24 2016 7:11 PM | Last Updated on Fri, Aug 24 2018 4:57 PM

Can YOU spot the camouflaged Marine in this video?

శత్రువు చేతిలో చనిపోవడమేకాదు, శత్రుదుర్బేధ్యమైన 'బిహైండ్ ది ఎనిమీస్ లైన్స్' లోనూ చాకచక్యంగా వ్యవహరించడం, గుట్టుచప్పుడు కాకుండా విరోధిని మట్టుపెట్టడమూ వీరత్వమే అంటూ ప్రపంచదేశాల సైనికులకు 'నిగూఢ' పాఠాలు నేర్పుతున్నాడు బ్రెంట్ డోనింగ్. అమెరికా సైన్యంలో పనిచేస్తోన్న ఆయన.. రహస్యంగా దాక్కొని శత్రువును చంపటం(కామెఫ్లాగ్ టెక్నిక్) ఎలాగో నేర్పేందుకు ఏకంగా యూట్యూబ్ లో ఛానెలే ప్రారంభించాడు.

 

ఆయా ప్రాంతాన్ని, అక్కడి పరిస్థితులను బట్టి అనువైన దుస్తులు ధరించి, చెట్టూపుట్టతో కలిసిపోయినట్లుండి అదనుచూసి శత్రువును ఎలా దెబ్బకొట్టాలో వీడియోలు రూపొందిస్తాడు బ్రెంట్. ఇటీవలే తన ఛానెల్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియోలో.. 'అడవిలో దాక్కున్న వీరజవాన్ ను కనిపెట్టండి చూద్దాం' అని నెటిజెన్లకు సవాలు విసిరాడు. ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో కొద్ది గంటల తర్వాత అతనే రివీల్ చేశాడు. బ్రెంట్ సవాలుపై మీరూ ఓ లుక్కెసి, జవాన్ ను కనిపెట్టండి..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement