
ఉగ్రవాదుల తెలివైన చర్య.. చూస్తే అవాక్కే..
తమను వేటాడుతున్న బలగాలు బిత్తరపోయేలా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రతి వ్యూహాలతో పరుగులు పెట్టిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సిరియాలో బలగాలను పక్కదారి పట్టిస్తోంది.
బావిజా: తమను వేటాడుతున్న బలగాలు బిత్తరపోయేలా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రతి వ్యూహాలతో పరుగులు పెట్టిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సిరియాలో బలగాలను పక్కదారి పట్టిస్తోంది. అది చేస్తున్న చర్యలు చూస్తుంటే మేథావులు కూడా ఔరా అనాల్సిందే. ప్రస్తుతం మోసుల్పై పూర్తిస్థాయి ఆదిపత్యం సంపాధించేందుకు అమెరికావంటి అగ్ర దేశాల సైన్యంతో కలిసి ఇరాక్ సేనలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, వైమానిక దాడులే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి బయటపడేందుకు ఏకంగా ఐసిస్ చెక్కలతో తయారు చేసిన యుద్ధ ట్యాంకులను, అందులో గడ్డం అమర్చి ఉంచిన మనిషి బొమ్మలను పెడుతోంది. వీటిని చూసి వైమానిక బలగాలు నిజమైన యుద్ధ ట్యాంకులే, నిజమైన ఉగ్రవాదులే అనుకోని పక్కదారి పట్టాలనేది ఉగ్రవాదుల వ్యూహం. ఇలా భ్రమపడి దాడులు కూడా జరిగాయి కూడా. ఒక్కో ప్రాంతంపై దాడి చేస్తూ ముందుకు వెళుతున్న బలగాలు ఉగ్రవాదుల స్థావరాలను స్వాధీనం చేసుకొని పరిశీలించగా ఈ విషయం తెలిసింది. ఇది చూసి తాము ఆశ్చర్యానికి లోనయ్యామని అబ్బాస్ అల్ అజాజి అనే కల్నల్ చెప్పారు.