విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలెట్ డెలివరీ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఎంతో ధైర్యంగా. సమయస్పూర్తితో వ్యవహరించి గర్భిణీకి పురుడు పోసినపైలెట్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు.
వివరాలు.. వీట్ జెట్‌కు చెందిన విమానం తైపీ(తైవాన్) నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వెళ్తోంది. విమానంలో ఓ గర్భిణి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బాత్రూమ్‌లో ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన సిబ్బంది విషయాన్ని పైలట్ జకరిన్ సరార్న్‌రక్స్‌కుల్‌కు తెలియజేశారు. విమానం ల్యాండింగ్‌కు కూడా సమయంలో ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో కెప్టెన్ జకరిన్ తన బాధ్యతలను కో పైలట్‌కు అప్పగించి కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చాడు. విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగాడు. కానీ సమయానికి వైద్యులు కూడా లేకపోవడంతో వేరే మార్గం లేక తానే రంగంలోకి దిగాడు. మొబైల్ ద్వారా వైద్యులను సంప్రదించి.. వారి సూచనలతో మహిళకు పురుడు పోశాడు.
ఇదంతా గమనించిన విమానంలోని ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్లిష్ట సమయంలో ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన పైలెట్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం విమానం ల్యాండ్ అయ్యాక తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు ముద్దుగా స్కై బేబబీ’ అని పేరు పెట్టారు. మరోవైపు 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు.
చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే
Comments
Please login to add a commentAdd a comment