పెర్త్: టేకాఫ్ తీసుకున్న కాసేపటికే గగనతలంలో విమానంలో మంటలు చెలరేగాయి. ఫైలట్ వెంటనే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతున్నారు. కోబమ్ ఏవియేషన్ విమానం ఉదయం 10: 45 గంటలకు పెర్త్ నుంచి బయల్దేరగా.. కాసేపటికే ఓ ఇంజిన్లో మంటలు చెలరేగినట్టు కోబమ్ ఏవియేషన్ తెలిపింది. ఫైలట్ ఇంజన్ను ఆపివేయడంతో మంటలు ఆరిపోయినట్టు పేర్కొంది. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పెర్త్ విమానాశ్రయంలో దించాడు. విమానంలో 93 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులెవరూ గాయపడలేదని కోబమ్ ఏవియేషన్ తెలియజేసింది.