రంగారెడ్డి, సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగగా, పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు.
హైదరాబాద్ నుంచి కౌలా లంపూర్(మలేషియా) వెళ్లాల్సిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుడి వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) ల్యాండింగ్‌కు అఉనమతి ఇచ్చారు. ఈ గ్యాప్‌లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు తెచ్చారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడం.. అంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment