
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల్లో కొంతమంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. దామన్ నుండి వస్తున్న 11 మంది ప్రయాణికులు అధికారులు కన్నుగప్పి లోదుస్తుల్లో బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించారు. వారి నుంచి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు విలువైన 3.11 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.