
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలోని డెకథ్లాన్ స్పోర్ట్స్ రూమ్‌లో బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. స్టోర్‌లో బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం బెదిరింపు కాల్ వచ్చింది. రిమోట్ బాంబ్ పెట్టినట్లు బెదిరించిన అగంతకుడు.. కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే రిమోట్‌తో బాంబును పేల్చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయభ్రాంతుకలకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీల తర్వాత బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో స్టోర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: ఎంజీబీఎస్‌లో డ్రైవర్ నిర్లక్ష్యం, చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment