గోవా నుంచి తీసుకొస్తుండగా.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ : గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఖరీదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గోవా నుంచి మూడు విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అదేశాలతో ఏఈఎస్ జీవన్‌కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు.
ఎస్‌టీఎఫ్ సీఐలు సుబాష్ చందర్‌రావు, చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ప్రవీణ్, శంషాబాద్ ఎక్సైజ్ సీఐ దేవేందర్‌రావుతోపాటు ఎస్సైలు, సిబ్బంది కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతో మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 12 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, సరూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన ఆర్‌ఎంపీలు గోవాలోని ఓ సదస్సుకు వెళ్లారు. వీరంతా తిరుగు ప్రయాణంలో మద్యం తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చిన నేరం కింద ఎక్సైజ్ ఈఏఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో శంషాబాద్ సీఐ దేవేందర్‌రావు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
‘చంఢీగడ్’మద్యం సీజ్
చండీగఢ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా చేరిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మెట్రోసేషన్ సమీపంలో రూ.3.85 లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment