శంషాబాద్: బంగారం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా.. అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా దుబాయి నుంచి భారీఎత్తున బంగారాన్ని తీసుకు వచి్చన ఓ ప్రయాణికుడిని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను కస్టమ్స్ అధికారులు అనుమానించారు.
అతడి వద్ద ఉన్న బ్యాగుల్లోని 4 ఇస్త్రీ పెట్టెలను విప్పిచూడగా అందులో కాయిల్స్ రూపంలో 9.2 కేజీల బంగారం బయటపడింది. బహి రంగ మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదు పులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు ఇస్త్రీపెట్టెలు
Published Sun, Aug 11 2019 1:58 AM | Last Updated on Sun, Aug 11 2019 5:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment