
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. గత రాత్రి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే.. అది గమనించిన సీఐఎస్‌ఎఫ్ బలగాలు.. ఆ యువతిని రక్షించారు.
శుక్రవారం రాత్రి డిపార్చర్ విభాగం వద్ద పైనుంచి దూకేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. వెంటనే అధికారులు ఆమెను కాపాడి.. మహిళా ఎయిర్‌పోర్ట్ అధికారులకు అప్పగించారు. సదరు యువతిని బెంగళూరు(సౌత్)కి చెందిన శ్వేతగా గుర్తించారు.
భర్త విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేతతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అనారోగ్యాన్ని తట్టుకోలేకపోయాడు! చివరకు ఆ కానిస్టేబుల్..
Comments
Please login to add a commentAdd a comment