శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం | Cab Driver Trying To Kidnap Children In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

Published Fri, Aug 2 2019 12:22 PM | Last Updated on Fri, Aug 2 2019 12:54 PM

Cab Driver Trying To Kidnap Children In Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం రేపింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్‌ చేసుకుంది. తల్లిదండ్రులు తొలుత మగ్గురు పిల్లలను ఒక క్యాబ్‌లో ఎక్కించారు. తరువాతి క్యాబ్‌లో తల్లిదండ్రులు బయలుదేరారు. అయితే పిల్లలు ఉన్న క్యాబ్‌ డ్రైవర్.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో తల్లిదండ్రులు కారును వెంబడించారు. దీంతో అతడు పిల్లల్ని, లగేజ్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే డ్రైవర్‌తో పాటు క్యాబ్‌లో ఉన్న అతడి స్నేహితుడిని మాత్రం పిల్లల తల్లిదండ్రులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని శంషాబాద్‌ పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement