
శంషాబాద్ (హైదరాబాద్): బూట్ సాక్సుల్లో కొంత.. మలద్వారంలో మరికొంత బంగారం దాచి విమానం దిగిన ఒక ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున జె9403 కువైట్ విమానం దిగిన ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె బూటు సాక్సుల్లో నల్లటి కవర్లలో దాచి ఉంచిన బంగారం బయటపడింది.
మహిళను మరింత విచారించగా.. నల్లటి ఉండల మాదిరిగా చేసి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చిన బంగారం పేస్టు గురించి ఆమె వివరించింది. దీంతో ఆ మహిళకు వైద్యులతో శస్త్రచికిత్స చేయించి బంగారాన్ని బయటికి తీయించారు. మొత్తం ఆమె నుంచి 1.646 కేజీల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.86 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment