
హైదరాబాద్: ఎయిర్‌పోర్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిన బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ ఎం. కృష్ణ సింగ్ అనే వ్యక్తి, ఓ వ్యాపారిని బోల్తా కొట్టించాడు. ఇటీవల కృష్ణ సింగ్ అనే పేరుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారినంటూ ఓ వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 11వ తేదీన బంగారం ఇస్తానని చెప్పి, ఆ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు.
తీరా సమయం గడిచేసరికి బంగారం ఇస్తానన్న కస్టమ్స్ అధికారి ఇవ్వకపోవడంతో ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో మోసపోయానని వ్యాపారి గ్రహించాడు. విషయం తెలుసుకున్న వ్యాపారి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బాధితులే ఇంకొందరు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment