
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లపాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన మార్క్ చూపించుకున్న బండి సంజయ్ కుమార్.. ఆ పదవికి రాజీనామా తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కీలక నేతలతో పార్టీ బలోపేతం గురించి చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
ఎయిర్‌పోర్ట్ బయట కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సుమారు 500 వాహనాల కాన్వాయ్ ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే కార్యకర్తలు, అభిమానులు భుజాల మీద ఎత్తుకుని బండిని కండువాలు కప్పే క్రమంలో ‘జై శ్రీరామ్’.. పాటు ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానం ప్రదర్శించారు.
ఆ సమయంలో అత్యుత్సాహం వద్దని, నినాదాలు చేయొద్దని వాళ్లను బండి సంజయ్ వారించారు. ఇక ప్రధాని మోదీ ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కేసీఆర్ నన్ను చూసి భయపడుతున్నాడు
Comments
Please login to add a commentAdd a comment