
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన రియల్ హీరో సోనూ సూద్ శంషాబాద్ విమానాశ్రయంలోని స్వర్ణిమ్ కౌంటర్‌ను సందర్శించారు. దివ్వాంగులు, శిశువులతో ఉన్న మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణిమ్ సేవలు బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు. స్వచ్చంద సంస్థ సహకారంతో సీఐఎస్‌ఎఫ్ స్వర్ణిమ్ పేరుతో దివ్వాంగులకు, మహిళలకు ప్రత్యేక సేవలను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్ అందిస్తున్న ఈ ప్రత్యేక సేవలు బాగున్నాయంటూ అక్కడ ఉన్న పుస్తకంలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అయితే లాక్‌డౌన్‌లో వలసజీవుల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానంటూ సోనూ సూద్ తన సేవలను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment