
శంషాబాద్: షిరిడీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అక్కడికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్‌జెట్ 1096, 3578 విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం వెళ్లాల్సిన ఆయా విమానాలను బుధవారానికి రీ షెడ్యూల్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment