
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నవంబర్ 3 నుంచి షిర్డీ–హైదరాబాద్ మధ్య ప్రతిరోజూ డైరెక్ట్ సర్వీసు నడుపనుంది. ఉదయం 9.35కు హైదరాబాద్‌లో బయల్దేరే విమానం షిర్డీలో 11 గంటలకు దిగుతుంది. తిరుగు ప్రయాణంలో 11.20కి ప్రారంభమై 12.40కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇందుకోసం బాంబార్డియర్ క్యూ400 రకం విమానాన్ని కేటాయించామని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్, రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. టికెట్ ధర షిర్డీకి రూ.3,999, తిరుగు ప్రయాణానికి రూ.3,900లు ఉంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లయిట్‌ను సంస్థ నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment