శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బేగంపేట విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు. టీడీపీ చెందిన విజయనగరం లోక్ సభ సభ్యుడు పి. అశోక్ గజపతిరాజు ఇప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.