
'ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మేల్కోవాలి'
న్యూఢిల్లీ: శంషాబాద్ దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టడమే అంటే ఆయనను చిన్నబుచ్చడమేనని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టాలని సూచించారు.
ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, మరణం తర్వాత కూడా ఆయనను అవమానిస్తున్నారని అన్నారు. ఇకనైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మేల్కోవాలని పేర్కొన్నారు.