'మళ్లీ దీక్ష చేసినా ఎవరు మద్దతివ్వరు'
విశాఖ: కాపు నేత ముద్రగడ పద్మనాభం చర్యలు కాపు జాతికి ద్రోహం చేసేలా ఉన్నాయని మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో భాష అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు. గురువారం ఉదయం వారు స్థానిక సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు.
ముద్రగడ కాపు జాతిని రెచ్చగొడుతూ, నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీటన్నిటి వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని మంత్రులు ఆరోపించారు. ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా, మళ్లీ దీక్షలంటూ ఆయన బెదిరిస్తున్నారని చెప్పారు. ఈసారి ఆయన దీక్షకు కూర్చున్నా మద్దతిచ్చేందుకు ఎవరూ ఉండరని చెప్పారు.