ganta sreenivas rao
-
‘విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారు’
సాక్షి, అమరావతి : విశాఖలో జరిగిన రేవ్‌పార్టీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. దీని వెనుక మంత్రి ఘంటా శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, హోమ్ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను వాడారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బీచ్‌లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ లైసెన్స్‌లు తీసుకున్నారని విమర్శించారు. విశాఖకు చెందిన మంత్రి పేషీ నుంచి 8సార్లు ఫోన్ చేశారని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్ చేసి ఒత్తిడి చేశారని తెలిపారు. టీడీపీ మంత్రే కాబట్టి సీఎం మాట్లాడటం లేదని అన్నారు. విశాఖ నార్త్‌లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. సీఎం అనవసరంగా మోదీపై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. సీఎంకు అసహనం ఎక్కవైపోతోందన్నారు. -
మంత్రి గంటాకు చేదు అనుభవం..!
సాక్షి, విశాఖపట్నం : జన్మభూమి అంటూ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న టీడీపీ నేతలకు నిరసనలు తప్పడం లేదు. సీఎం నుంచి మంత్రులు దాకా, మంత్రులు నుంచి ఎమ్మెల్యేలు వరకూ ప్రజాగ్రహజ్వాలకు గురవుతున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పొగరి సీఎం చంద్రబాబు సభలో మహిళలు వ్యతిరేక నినాదాలతో మార్మోగించగా.. ఇప్పుడు విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. మధురవాడ సాయిరాం కాలనీలోని జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆయనకు స్థానిక సమస్యలపై నిరసన జ్వాల ఎగసిపడింది. స్థానిక సమస్యలపై ప్రశ్నలవర్షం కురవడంతో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ మంత్రి గంటాను స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంచేశారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారులు - కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 15వ వార్డులో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదంటూ అధికారులను నిలదీశారు. కాలనీలో నీరు, రోడ్లు, డ్రైనేజీ లేక అల్లాడుతుంటే పరిష్కారం చూపని జన్మభూమి తమకొద్దూ అంటూ, ఇక్కడినుంచి వెళ్లిపోండని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు - అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులో జరిగిన జన్మభూమి కార్యాక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తిత్లీ తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు అధికారుల్ని, అధికార పార్టీ నేతల్ని నిలదీశారు. దీంతో అధికార పార్టీ నేతలు నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. తుపాను కారణంగా తీవ్రం నష్టపోయి రోడ్డున పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని పైగా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. -
'మళ్లీ దీక్ష చేసినా ఎవరు మద్దతివ్వరు'
విశాఖ: కాపు నేత ముద్రగడ పద్మనాభం చర్యలు కాపు జాతికి ద్రోహం చేసేలా ఉన్నాయని మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో భాష అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు. గురువారం ఉదయం వారు స్థానిక సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ కాపు జాతిని రెచ్చగొడుతూ, నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీటన్నిటి వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని మంత్రులు ఆరోపించారు. ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా, మళ్లీ దీక్షలంటూ ఆయన బెదిరిస్తున్నారని చెప్పారు. ఈసారి ఆయన దీక్షకు కూర్చున్నా మద్దతిచ్చేందుకు ఎవరూ ఉండరని చెప్పారు. -
ఫిబ్రవరిలో డీఎస్సీ నియామకాలు: గంటా
-
ఫిబ్రవరిలో డీఎస్సీ నియామకాలు: గంటా
హైదరాబాద్: డీఎస్సీ-2014 రాతపరీక్షలకు హాజరై, ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు. 8,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి లైన క్లియర్ అయింది. ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నియామకాలు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. 8,086 పోస్టులకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందన్నారు. మిగిలిన పోస్టులపై కోర్టు స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి కోర్టుకు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు గంటా వెల్లడించారు. -
14 నుంచి 25 వరకు స్కూళ్లకు సెలవులు : గంటా
హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా ఉభయగోదావరి జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 14 వ తేదీ నుంచి 25 వరకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఈ మేరకు అధికారులను ఆదేశించారు.