ఫిబ్రవరిలో డీఎస్సీ నియామకాలు: గంటా
Published Fri, Jan 22 2016 12:24 PM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
హైదరాబాద్: డీఎస్సీ-2014 రాతపరీక్షలకు హాజరై, ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు. 8,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి లైన క్లియర్ అయింది. ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నియామకాలు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.
8,086 పోస్టులకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందన్నారు. మిగిలిన పోస్టులపై కోర్టు స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి కోర్టుకు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు గంటా వెల్లడించారు.
Advertisement
Advertisement