విజయవాడ: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని మాత్రమే సేకరిస్తామని మంత్రులు కొల్లు రవీంధ్ర, నారాయణ అన్నారు. 14 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చామని వారు తెలిపారు. ఇందులో ఏడు వేల ఎకరాల్లో మెగా టౌన్ షిప్ నిర్మిస్తామని చెప్పారు. భూములు కోల్పోయే రైతులకు తుళ్లూరు తరహాలోనే పరిహారం చెల్లిస్తామని మంత్రులు తెలిపారు.