గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు | Differences in Gannavaram Constituency TDP | Sakshi
Sakshi News home page

గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

Published Thu, Apr 6 2023 3:35 PM | Last Updated on Thu, Apr 6 2023 4:55 PM

Differences in Gannavaram Constituency TDP - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్‌ జంక్షన్‌లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో  హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అక్కడ నుంచి జారుకున్నారు.
 

చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement