gannavaram constituency
-
గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి తుప్పు పట్టిపోయింది. ఎక్కడి నుంచో తెచ్చి తమ నెత్తిన రుద్దిన ఇంచార్జ్ మీద చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వెళుతున్న పార్టీ అధినేతను దారి మధ్యలో కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారట. తనకు, తన పార్టీకి పట్టిన ఖర్మ గురించి చింతిస్తూ సైకిల్ పార్టీ బాస్ అలా ముందుకు సాగిపోయారట. అర్జునుడా ఇదేం అన్యాయం.? కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ బలమైన కమ్మ సామాజికవర్గమే గెలుపును నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే రెండు సార్లు టీడీపీ తరపున గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడైన వంశీ వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు పలికారు. ఫలితంగా గన్నవరంలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మచిలీపట్నానికి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తీసుకొచ్చి గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఎవరో ఒకరులే.. ఇంఛార్జి రూపంలో తమకొక నాయకుడు దొరకాడని గన్నవరం తమ్ముళ్లు సరిపెట్టుకున్నారు. కాని టీడీపీ క్యాడర్ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇంఛార్జిగా వచ్చాడే కానీ బచ్చుల క్యాడర్‌ను పట్టించుకోవడం మానేశాడట. ఓ వర్గాన్ని మాత్రమే తనతో తిప్పుకుంటూ తొలినుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలేశాడట. కనీసం పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా గన్నవరం కేడర్‌కు ఇవ్వడం లేదట. బచ్చుల వైఖరితో విసిగిపోయిన అక్కడి నాయకులు, కార్యకర్తలు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మొహం చూడటం మానేశారట. సైకిల్‌కు స్టాండ్ లేదా? గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడి వైఖరి నచ్చక ఎవరైనా ప్రశ్నిస్తే వారి పైనే ఫైరవుతున్నాడట. సమస్యలను బచ్చుల దృష్టికి తీసుకెళితే మీరేంటి నాకు చెప్పేది అంతా నాకు తెలుసు అంటూ దబాయిస్తున్నాడట. మీరంతా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు.. ఎమ్మెల్యే వంశీ వర్గీయులు అని ముద్రవేస్తున్నాడట. ఎవరైనా గట్టిగా మాట్లాడారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేస్తానని బెదిరిస్తున్నారట. వార్నింగ్ ఇవ్వడమే కాదు.. బచ్చుల అర్జునుడు ఇంఛార్జి అయిన తర్వాత ఇప్పటి వరకూ పదిమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశాడట. ఐతే ఈ పరిణామాలతో నైరాశ్యంలో పడ్డ క్యాడర్ పార్టీ ఆఫీస్‌కు, కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట. పార్టీ అధినేతతో పాటు ఎవరైనా ముఖ్య నేతలు వచ్చినపుడు.. ఎయిర్ పోర్టులో కలిసి వచ్చేస్తున్నారని సమాచారం. చదవండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు లీడర్ కాదు, లీడర్ షిప్ కావాలి ఇంఛార్జిగా కొనసాగుతున్న బచ్చులలో కనీసం నాయకుడి లక్షణాలు లేకపోయినా.. రెండేళ్లుగా సరిపెట్టుకుంటున్న క్యాడర్‌కు ఇక ఓపిక నశించిపోయింది. అందుకే తమ పంచాయతీని అధినేత ఎదుటే తేల్చుకోవాలని భావించారట. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వెళుతున్న చంద్రబాబుకు బచ్చుల అర్జునుడి వ్యతిరేక వర్గం అంతా కట్టకట్టుకుని వెళ్లి మరీ స్వాగతం పలికారట. అధినేతకు స్వాగతం పలకడంతో సరిపెట్టకుండా బచ్చుల అర్జునుడి వైఖరి పట్ల తమలో ఉన్న ఆవేదనంతా ఓ లేఖలో వెళ్ళగక్కారట. మరోవైపు బచ్చుల, అతని అనుకూల వర్గం మరోచోట చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారట. రెండు వర్గాలు రెండు ప్రదేశాల్లో స్వాగత ఏర్పాట్లను ఊహించని చంద్రబాబు.. ఈ పరిణామాలతో షాకయ్యారట. ఓ వైపు ఇదేం ఖర్మరా కార్యక్రమానికి వెళ్తుంటే పార్టీలో గొడవలు.. పంచాయతీలు స్వాగతం పలుకుతుండటంతో.. నాకిదేం ఖర్మరా బాబు అనుకుంటూ తలబాదుకుంటున్నారట పచ్చ పార్టీ బాస్ చంద్రబాబునాయుడు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఆ నియోజకవర్గంలో పచ్చపార్టీకి సరైన నాయకుడే లేడు!
కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా చెబుతారు. కాని అక్కడే పచ్చ పార్టీకి సరైన నాయకుడు లేడు. బయటి నుంచి వచ్చి పెత్తనం చేస్తున్న నేతను అక్కడి వారు పట్టించుకోవడం మానేశారట. కాని బీసీ కార్డుతో టిక్కెట్ తెచ్చుకోవాలని ఆ నాయకుడు ప్రయత్నిస్తున్నారు. అధినేత మాత్రం వేరే నేత కోసం అన్వేషిస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అసలక్కడ ఏం జరుగుతోంది? కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కేంద్రమైన గన్నవరం ... తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అడ్డాగా మారింది. ఐతే ఇదంతా గతం ... ఇప్పుడు గన్నవరంలో సైకిల్ పార్టీ శ్రేణులను పట్టించుకునే నాధుడే లేడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. 2019లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో గన్నవరం టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని తీసుకొచ్చి నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు కట్టబెట్టింది అధిష్టానం. బచ్చుల రూపంలో తమకో నాయకుడు దొరికాడని గన్నవరం టీడీపీ క్యాడర్ సంబరపడిపోయింది. కట్ చేస్తే పేరుకి ఇంఛార్జిగా ఉన్నాడన్నమాటే కానీ బచ్చుల కార్యకర్తలకు అండగా నిలవలేకపోతున్నారట. ఓ వర్గాన్ని మాత్రమే తన వెంటేసుకుని తిరుగుతున్నారని టాక్. పార్టీ కార్యక్రమాల్లో తన కోటరీని తప్ప మిగిలిన వారిని కలుపుకుపోవడం లేదట. గతంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చక్రం తిప్పిన గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు బచ్చుల వెంటే ఉంటూ అంతా తానై నడిపిస్తున్నారట. ఇంచార్జ్‌గా ఉంటున్న బచ్చుల అర్జునుడు తీరు నచ్చని చాలామంది గన్నవరం టీడీపీ ఆఫీస్ గుమ్మం తొక్కడం కూడా మానేశారట. మరికొందరైతే బచ్చులకు నాయకత్వ లక్షణాలే లేవు అంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. ఇంకొందరైతే లీడర్ షిప్ క్వాలిటీస్ లేని ఈ బచ్చులతో మనకేల కామ్ గా ఉంటే పోలా అని సైడైపోతున్నారట. మరోవైపు గన్నవరంలో ప్రధాన సామాజిక వర్గం, టీడీపీకి అండగా ఉండే కమ్మవారిని సైతం బచ్చుల దూరం పెడుతూ వస్తున్నారట. అటు కమ్మ సామాజికవర్గం నేతలు, శ్రేణులు కూడా బచ్చుల వైఖరితో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారట. పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా దూరంగా ఉండి చూస్తున్నారే కానీ..ప్రత్యక్షంగా పాల్గొనడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎవరైనా ముఖ్యనేతలు లేదా పార్టీ అధినేత చంద్రబాబు గన్నవరం వస్తే ఎయిర్ పోర్టులో కలిసి కామ్ గా వెళ్లిపోతున్నారట . ఇదిలా ఉంటే నియోజకవర్గ ఇంఛార్జిగా క్యాడర్ కు అండగా నిలబడలేకపోతున్న బచ్చుల ఈసారి గన్నవరం టిక్కెట్టు తనకే ఇస్తారని ఆశలు పెట్టుకున్నాడట. ఏ సందర్భం దొరికినా వైసీపీ ప్రభుత్వాన్ని , సీఎంను తిడుతూ చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారని అక్కడి కేడర్ చెప్పకుంటున్నారు. తాను బీసీ నాయకుడిని కాబట్టి... టీడీపీలో బీసీలకు పెద్ద పీట వేస్తామని పదే పదే డబ్బాలు కొట్టుకునే అధినేత మాట నిజమే అనుకుని గన్నవరం టిక్కెట్ తనకే ఇస్తారని ఇప్పట్నుంచే కర్చీప్ వేసుకుని రెడీగా ఉన్నాడట బచ్చుల అర్జునుడు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం బచ్చుల ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నాయని వినికిడి. చాలా రోజుల నుంచి చంద్రబాబు గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసే క్యాండేట్ కోసం భూతద్ధంతో వెతుకుతున్నారట. తనదగ్గరకి వచ్చే వారిని సీటిస్తా ... గన్నవరం పోతావా అంటూ అడుగుతున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం నియోజకవర్గంలోని తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మొదట్నుంచి పార్టీనే నమ్ముకున్న తెలుగుదేశం క్యాడర్ మాత్రం అర్జంట్ గా సరైన నాయకుడిని ఇంఛార్జిగా నియమించకపోతే గన్నవరంలో ఉన్న కొద్దిపాటి పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని బాహాటంగానే చెప్పేస్తున్నారట. ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశానికి దూరం కావడంతో...అక్కడి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన వెంటే నడిచారు. అందువల్లే గన్నవరంలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థే కనిపించడంలేదు. -
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా
-
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రిజైన్ చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కి పడిపోయింది. కాగా ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి... టీడీపీ పార్లమెంటరీ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిన విషయం విదితమే. మరోవైపు టీడీపీకి చెందిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. -
24న సూరంపల్లిలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, గన్నవరం: ఈ నెల 24న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సీపెట్ భవనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ హాజరుకానున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను సోమవారం.. ఇన్‌ఛార్జి కలెక్టర్ మాధవిలత, సీఎం ప్రొగాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ గన్నవరం ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, నూజివీడు సబ్ కలెక్టర్ స్వీప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. -
మట్టితో ‘బాబు’లు కాసుల పండుగ
సాక్షి, విజయవాడ : కాలం మారింది.. కాలం మారింది అనంటారు. కానీ సూర్యచంద్రుల గతి మారలేదు.. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం వాటి నిబద్ధత మారలేదు. ఋతువుల క్రమమూ మారలేదు. ఫల, పుష్పాలు, పక్షిజాతులు వాటి ప్రక్రియల్లోనే ముందుకు సాగుతున్నాయి. మరి మారిందేమిటీ? మనిషి ఆలోచనా విధానం. తను మారి అన్నింటినీ మార్చాలనుకుంటున్నాడు. అలా మార్చేవారిలో ప్రధములు రాజకీయ నాయకులే. అందునా అధికారం చేతిలో ఉన్నవారైతే చెప్పేదేముంటుంది. పంచభూతాలను తమ వశం చేసుకుని దాన్ని ఎలా నగదుగా మార్చుకోవాలో వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు కూడా. అప్పట్లో ఖాళీ స్థలాలు కనపడితే పాగా వేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అక్కడి మట్టి నుంచి కాసులు రాల్చేదెలాగో తెలుసుకున్నారు. దాన్నే అనుసరించారు.. భూమాతకు తూట్లు పొడిచారు. ఇందుకోసం ఓ పథకాన్ని రూపకల్పన చేసి.. దాని అసలు లక్ష్యాన్ని మార్చేసి.. వేల కోట్ల రూపాయలు బొక్కేశారు. ఆ పథకం పేరే ‘నీరు–చెట్టు’. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బ్రహ్మలింగయ్య చెరువులో నీరు– చెట్టు క్రింద చేపట్టిన పనులు స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా పెద్దబాబు, చిన్నబాబులకు కాసుల వర్షం కురిపించింది. ఆఖరకు ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా తొలగించి మట్టిని కొల్లగొట్టి విక్రయాలు చేసుకున్నారంటే మట్టి టీడీపీ నేతలకు ఎంత ఆదాయాన్ని సంపాదించి పెట్టిందో అర్ధమౌతుంది. మూడేళ్లుగా రిజర్వాయర్ పేరుతో ఈచెరువు పూడి తీస్తున్నారు. ఈ మట్టివిక్రయాలు ద్వారా టీడీపీ నేతలకు సుమారు రూ.50 కోట్లు ముట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, సినీనటుడు బాలకృష్ణకు బంధువు అయిన కృష్ణాబాబు మట్టిని కొల్లగొట్టారు. గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామ చెరువును గత ఏడాది వేసవిలో నీరు–చెట్లు పధకం క్రింద తీసుకుని మట్టిని ‘కృష్ణా’ ర్పణం చేశారు. ఈ ‘బాబు’ అడ్డగోలుగా మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విక్రయించి లక్షలు గడించినా.. అధికారులు కానీ, గ్రామం సర్పెంచ్, ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయారు. మట్టి విక్రయం ద్వారా అ విషయంలో మేము నిస్సహాయులం అంటూ నాటి గుడివాడ ఎండీఓ జ్యోతి స్వయంగా వాపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన ఎమ్మెల్యేలకు కోట్లు కాసులు కమ్మురించే నీరు–చెట్టు ప«థకానికి శ్రీకారం చుట్టారు. కాల్వలో మట్టిని పూడిక తీసి కాల్వలు, గ్రామాలను అభి వృద్ధి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన నీరు–చెట్టు పథకం లక్ష్యాన్ని మార్చేశారు. అసలు లక్ష్యాన్ని పక్కనబెట్టి అంతర్గతంగా తమ పనులు పూర్తి చేసుకున్నారు. మట్టిని విక్రయించుకుని కోట్లు కొల్లగట్టటమేనని తరువాత అర్ధమైంది. మట్టి నుంచి నోట్లు పిండారు! టీడీపీ నేతలు మట్టి నుంచి నోట్ల కట్టలను పిండారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఆవురావురు మంటుండగా... నీరు–చెట్లు వరంగా మారింది.దీనికితోడు జలవనరులశాఖ మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అడిగే అధికారే కరువయ్యారు. నీటి సంఘాలు, పంచాయతీలు తమ చేతుల్లో ఉండటం. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి గ్రామస్థాయి నాయకులు వరకు అందిన కాడికి దండుకున్నారు. ముఖ్యమంత్రి బంధువే మట్టిని రియల్ ఎస్టేట్‌కు అమ్ముకోగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బినామీలే పనులు చేస్తూ మట్టిని యథేచ్ఛగా అమ్ముకున్నారు. ఇక బ్రహ్మలింగయ్య చెరువులోని మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి, ఎయిర్ పోర్టు కు ఉపయోగిస్తూనే మట్టిని విక్రయించి కోట్లు గడించారు. చేయాల్సింది ఇదీ... ఈ పన్నుల్ని నీటిసంఘాల ద్వారా, పంచాయతీల ఆమోదంతో చేయాలని నిర్ణయించారు. చెరువుల్లో మట్టి, తీయడం, చెరువుల గట్లు బలపేతం చేయడం, చెత్తా, మొక్కలతో పూడిపోయిన చెరువుల్ని జంగిల్ క్లియరెన్స్ చేయించడం, నీటిని నిల్వ చేసుకునేందుకు చెక్ డ్యామ్స్‌ను నిర్మించడం ట్యాంకు ఫీడర్లు ఏర్పాటు చేయడం వంటి పనుల్ని ఈ నీరు –చెట్టు క్రింద చేపట్టాలని నిర్ణయించారు. చెరువులు ఎండిపోయిన తరువాత వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఈ పనులు చేయాలని నిర్ణయించారు. ఎలక్షన్లలో కోట్లు వెదజల్లుతున్నారు నీరు–చెట్టు ద్వారా అధికారపార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లు వరకు వెనకేసుకున్నట్లు సమాచారం. ఓ మంత్రి ఆదాయమైతే దీనికి రెట్టింపు ఉంటుదని అంచనా. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. అప్పట్లో ప్రతి లారీని లెక్క గట్టి డబ్బులు వసూలు చేసి రిజర్వు చేశారని ఇప్పుడు అవేడబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనేందుకు ఎగబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకసారి నీరు–చెట్లు ద్వారా కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు తిరిగి అదే అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడక ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారు. నిమ్మకూరులో మట్టినే అమ్మేశారు చెరువులో మాయమైన మట్టి నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు అవినీతి పనులు టీడీపీ నేతలకు జేబులు నింపాయి. ఎంతో సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ పథకాన్ని ఏ రకంగా ఉపయోగించుకుని డబ్బులు సం పాదించుకోవచ్చో అదే తరహాలో పనులు చేసి డబ్బులుగడించారు నేతలు.పథకానికి సంబంధించిన నిబంధనలు ఎక్కడా అమలు చేసిన దాఖలాలు కనపడవు. తమ పార్టీ వ్యవస్థాపన అధ్యక్షుడి స్వగ్రామం నిమ్మకూరులోని పనుల్లోనే నేతలు కాసుల వర్షం కురిపించుకున్నారు. గుడివాడలో అందినకాడికి... గుడివాడ నియోజకవర్గంలోని నీరు చెట్టు పథకమంతా అవినీతి మయమే. ఒక్కచోట కూడా టీడీపీ నేతలు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. అధికార పార్టీల నేతలే ఒకరికొకరు విమర్శించే స్థాయిలో పనులు సాగడం విశేషం. నందివాడ మండలంలో మేజర్ డ్రెయిన్‌గా ఉన్న చంద్రయ్యను ఎవరికి తోచినట్లు వారు పంచేసుకుని మెక్కేశారు. దీని పూడిక తీయటం కోసం రూ. 78 లక్షలు కేటాయిస్తే ఏడుగురు టీడీపీ నేతలు వాటిని పంచేసుకున్నారు. ఇక మరో మేజర్ డ్రెయిన్ నెహ్రాల్లీ. దీనిని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తీసుకున్నారు ప్రభుత్వం రూ.1.15 కోట్లు కేటాయిస్తే తూతూ మంత్రంగా పనులు చేశారు. కనీసం రూ.50 లక్షలు టీడీపీ నేతలకు మిగిలినట్లు భోగట్టా. -
గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్
-
అసమ్మతి ఆనవాయితీ
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. అక్కడ ప్రధాన పార్టీల నాయకులకు అసమ్మతి బెడద, వర్గపోరు ఆనవాయితీగా వస్తోంది. దీనికితోడు ఇక్కడ ఒకసారి ఓడిస్తే మరో ఎన్నికలో సానుభూతితో గెలిపించే సంప్రదాయం కూడా ఓటర్లలో ఉంది. ఫలితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ నియోజకవర్గం ‘గన్’వరంగా గుర్తింపు పొందింది. 1994 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గద్దె రామ్మోహన్రావు ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. గద్దె చేతిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు పరాజయంపాలయ్యారు. అప్పట్లో సానుభూతి ఓట్లతో గద్దె గెలవడంతో ఓటమిపాలైన బాలవర్థనరావు ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం గద్దె తిరిగి టీడీపీలో చేరడంతో 1994 నుంచి 1999 వరకు గద్దె, దాసరి రెండు వర్గాలుగా గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ఎంపీగా గద్దెను పంపి దాసరికి గన్నవరం సీటు కేటాయించి వర్గ వైషమ్యాలను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. 1999 ఎన్నికల్లో అప్పటి ఎంపీ కావూరు సాంబశివరావు మద్దతుతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పొంది గన్నవరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముద్దరబోయినకు అప్పటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు. కాంగ్రెస్‌లో అసమ్మతికితోడు ప్రజల్లో సానుభూతి తోడుకావడంతో 1999 ఎన్నికల్లో దాసరి విజయం సాధించారు. ఓటమి పొందిన ముద్దరబోయిన నియోజకవర్గంలో మకాం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. అంతకుముందు రెండు ఎన్నికల నుంచి చెల్లాచెదురైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన ముద్దరబోయినకు 2004 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించలేదు. అధిష్ఠానం కడియాల బుచ్చిబాబును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేయడంతో బిత్తరపోయిన ముద్దరబోయిన కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009 ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించినప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసిన దాసరి చేతిలో పరాజయం పాలుకాక తప్పలేదు. తాజాగా.. గన్నవరంలో గతం నుంచి కాంగ్రెస్, టీడీపీ నువ్వానేనా అనే రీతిలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది. వైఎస్సార్సీపీ పట్టు సాధించింది. ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మాత్రం అసమ్మతి అనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్లు ఇద్దరూ టికెట్ నాది అంటే నాది అంటూ పంతాలకు పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి సామాజికవర్గానికి చెందిన పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగిలిన వారు అసమ్మతి అనవాయితీని కొనసాగిస్తూ రెబల్ అవుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
రసకందాయంలో గన్నవరం రాజకీయం