
సాక్షి, గన్నవరం: ఈ నెల 24న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సీపెట్ భవనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ హాజరుకానున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను సోమవారం.. ఇన్‌ఛార్జి కలెక్టర్ మాధవిలత, సీఎం ప్రొగాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ గన్నవరం ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, నూజివీడు సబ్ కలెక్టర్ స్వీప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment