
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రిజైన్ చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కి పడిపోయింది. కాగా ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి... టీడీపీ పార్లమెంటరీ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిన విషయం విదితమే. మరోవైపు టీడీపీకి చెందిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment