konakalla narayana rao
-
గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
AP: మాజీ ఎంపీ కొనకళ్లతో ప్రాణహాని ఉంది.. ఆవేదనలో బాధితుడు
సాక్షి, కృష్ణా: టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయి. బందరులో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బందరు మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ, అతడి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు మురళీ కృష్ణ.. పోలీసులను ఆశ్రయించాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. -
టీడీపీ అసమర్థ పాలనకు ఇదే సాక్ష్యం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల అసమర్థ పాలనపై గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు చొరవ చూపకుండా విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. మూలుగుతున్న ఇంటింటికి కుళాయి నిధులు గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.37 కోట్లు కేటాయించింది. కేవలం నెల రోజుల్లో పథకాన్ని పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని కొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎక్కడా ప్రారంభం కాకపోవడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మంగినపూడికి మంగళం అరిసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, మంగినపూడి, చిరివెళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మంగినపూడి తాగునీటి పథకాన్ని2012లో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2015 వరకు ఈ పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు పుష్కలంగా చేరింది. టీడీపీ నాయకులు పథకం నిర్వహణ కాంట్రాక్ట్ పనులు చేజిక్కించుకుని పైప్‌లైన్‌కు ఏర్పడుతున్న లీకులకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఏ గ్రామానికి తాగునీరు సక్రమంగా చేరకపోవడంతో ప్రజలు బిందె నీటిని రూ.20 కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఏడాది జరుగుతున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డంపింగ్ యార్డు తరలింపులోనూ నిర్లక్ష్యమే.. స్థానిక రాజుపేట శివారులో శివగంగ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డును తరలించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. రాజుపేట, కరెంటుకాలనీ ప్రజలతోపాటు మండలంలోని ఎస్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం, సుల్తానగరం గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఈ యార్డు ప్రభావం చూపుతోంది. దీన్ని అక్కడి నుంచి తరలించాలని గత పాలకవర్గం హయాంలోనే రూ.2.75 కోట్ల మునిసిపల్ నిధులను సమకూర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా యార్డు తరలింపు అంగుళం ముందుకు కదలకపోవడం పాలనాతీరును ఎద్దేవా చేస్తోంది. తాగునీటి పథకాన్ని వీడని గ్రహణం చిన్నాపురం గ్రామంలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి శివారు పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. పథకం నిర్మాణానికి భూమి కొలుగోలు ప్రక్రియ అప్పట్లోనే పూర్తయింది. ఈ ప్రాంతాన్ని రెండుసార్లు అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు. పాలకుల చొరవ లేకపోవడంతో పథకం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలకుల అసమర్థత కారణంగా చిన్నాపురం గ్రామ పంచాయతీతోపాటు ఎన్‌గొల్లపాలెం, పెదయాదర, తుమ్మలచెరువు, వాడపాలెం, కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పంచాయతీల ప్రజలు ఐదేళ్లుగా ఉప్పునీరు తాగుతున్నారు. అప్రోచ్ నిర్మించ లేకపోయారు పల్లెతాళ్లపాలెం గ్రామం వద్ద తాళ్లపాలెం మేజర్ డ్రెయిన్‌పై నిర్మాణం చేసిన వంతెనకు అప్రోచ్‌ను నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత పాలకవర్గం హయాంలోనే రూ.60 లక్షలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. సత్తెనపాలెం ఎస్సీకాలనీ, బోట్లవానిపాలెం గ్రామాలను కలుపుతూ పల్లెతాళ్లపాలెం గ్రామం మీదుగా కానూరు, పెదపట్నం సులువుగా చేరుకునేందుకు అప్పట్లో పేర్ని నాని ఈ వంతెన నిర్మాణం చేశారు. వంతెనకు ఒక వైపున అప్రోచ్ రోడ్డును నిర్మాణం చేసేందుకు ఓ రైతు వద్ద కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. సదరు రైతుకు పరిహారం మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. -
బందరు బాద్షా ఎవరో?
సాక్షి,మచిలీపట్నం : మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలో స్థూలంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారుల జనాభా అధికం. 1952 నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా, తొమ్మిది సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ గెలిచాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. మచిలీపట్నం లోకసభకు తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి సనక బుచ్చికోటయ్య ఎంపీగా ఎన్నికయ్యారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండల వెంకటస్వామి విజయం సాధించారు. ఈ నియోజకవర్గ పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు గెలుపొందారు. మరోసారి ఆయననే టీడీపీ బరిలోకి దించింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి.. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెచ్చుమీరిన అంతర్గత విభేదాల వల్ల టీడీపీ బలహీనపడింది. దీంతో ఈసారి ఎంపీగా గెలవడం కష్టమని భావించిన కొనకళ్ల నారాయణ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకూ ప్రయత్నించినా కుదర్లేదు. పైగా పార్లమెంటు పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీపై సొంత సామాజికవర్గంలోని వ్యతిరేకత ఏర్పడింది. బలమైన కేడర్ ఉన్న దాసరి జైరమేష్, బాలవర్ధన్‌రావు వైఎస్సార్సీపీలో చేరడం టీడీపీకి భారీ దెబ్బ. గుడివాడ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను టీడీపీ బరిలోకి దించింది. స్థానికేతరుడైన అవినాష్‌ను ఈ నియోజకవర్గ ఓటర్లు ఆదరించే పరిస్థితి లేదు. బలమైన నాయకుడైన వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలినాని ముందు అవినాష్ తేలిపోయారు. ఇక పెడనలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ టికెట్ కోసం బాగా ప్రయత్నించారు. చివరకు కాగిత కృష్ణప్రసాద్‌కు అక్కడ టీడీపీ టికెట్ ఇవ్వడంతో వేదవ్యాస్ వర్గం ఎన్నికల్లో సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగిరమేష్ దూసుకుపోతున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి కొల్లురవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య(నాని) నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అవనిగడ్డలో టీడీపీ నేత అంబటి శ్రీహరి ప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు కుమారుడి అవినీతి అక్రమాలతో బాగా చెడ్డపేరు వచ్చింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బరిలో ఉన్నారు. పామర్రు(ఎస్సీ)లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను టీడీపీ బరిలోకి దించింది. దీంతో ఓ సామాజిక వర్గం అలకబూనింది. అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఆమె పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్ పోటీగా బరిలోకి దిగారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ బరిలో మరోసారి టీడీపీ అభ్యర్థిగా బోడెప్రసాద్ బరిలో ఉన్నారు. కాల్‌మనీ వ్యవహారం, దౌర్జన్యాలు నియోజకవర్గ పరిధిలో మితిమీరిపోయాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. రాజన్న మాట.. అభివృద్ధి బాట దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు బీజం వేశారు. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనుల్లో భాగంగా బందరు కాలువ డ్రయినేజీ పనులు చేపట్టారు. నూజివీడులో 2008లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్అండ్టీ సంయుక్త సౌజన్యంతో నిర్మించిన ఐటీపార్కు మొదటి టవర్‌లో 14 కంపెనీలు పూర్తిస్థాయిలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 1,500 మంది ఐటీ విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల అయిన బందరు పోర్టు ఏర్పాటుకు 2008 ఏప్రిల్ 23న రూ. 1,500 కోట్లతో ఆయన శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. – ఎం. రామ్మోహన్ సాక్షి, అమరావతి బ్యూరో వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్సీపీ) 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి లోక్‌సభ(2009 ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు లేదు) ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఈయన వ్యాపారవేత్త. ఆయన ఎన్నో కళాశాలలను నెలకొల్పారు. రక్షణ, వాణిజ్య విభాగం పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొనకళ్ల నారాయణరావు(టీడీపీ) ఈయన ఎంపీగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆయన సరిగా వాదన వినిపించలేదని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏనాడు బందరు పోర్టు పనుల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలున్నాయి. మొత్తం ఓటర్లు 14,29,861 పురుషులు 7,01,396 మహిళలు 7,28,355 ఇతరులు 110 -
‘తెలంగాణలో ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర ఓటమికి తామే కారణమంటూ ప్రచారం చేయడాన్ని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తప్పుబట్టారు. ప్రజాకూటమి ఓటమిని తమ ఖాతాలో వేయొద్దంటూ విన్నవించారు. తెలంగాణలో ప్రచారానికి కట్టుబట్టలతో వచ్చిన తాము రాష్ట సమస్యలతోనే తీరిక లేకుండా ఉన్నామన్నారు. కేసీఆర్ మాటకారి.. ఆయన ఏదైనా మాట్లాడగలడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘స్పీకర్ సుమిత్రా మహాజన్ తో జరిగిన సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. సమస్యలపై కేంద్రం స్పందించే తీరునుబట్టి నిరసన కార్యక్రమాలు చేస్తాం.రాష్ట్ర విభజన హామీలను అమాలు చెయ్యాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ లు చేస్తున్న చేస్తున్న దాడులపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాయకులను డీమోరలైజ్ చెయ్యడానికి దాడులు చేయిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మమ్మల్ని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం సహకరిస్తామని చెప్పడంతో వారితో కలిసాం. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’ అని కొనకళ్ల పేర్కొన్నారు. -
టీడీపీలో ‘గల్లా’ కలకలం!
సాక్షి, అమరావతి: టీడీపీలో ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం కలకలం రేపింది. అధికార పార్టీ ఎంపీల మధ్య విభేదాలు టీడీపీ అధినేత చంద్రబాబు సాక్షిగా బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆదివారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కృష్ణా జిల్లా ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గైర్హజరయ్యారు. విజయవాడలో ఉన్నప్పటికీ కేశినేని నాని సమావేశానికి రాలేదు. గల్లా జయదేవ్‌కు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తితోనే వీరు సమావేశానికి గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వర్గీయులుగా ముద్రపడిన కేశినేని, నారాయణరావు సమావేశానికి రాకపోవడంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. హంగామా అవసరమా..? మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుతో కలిసి చేసిన హంగామా చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమీ సాధించకుండానే విజయోత్సవాలు నిర్వహించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని సరి చేసేందుకు కేంద్రం ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ, ఏదో సాధించినట్టు టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయకపోయినా సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల్లో చెలరేగిన అసంతృప్తి ఏవిధంగా మారుతుందోన్న చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై మిత్రపక్షంగా తాము అసంతృప్తిగా ఉన్నామంటూనే టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం కొసమెరుపు. -
పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ
భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు టీడీపీ ముఖ్యనాయకులతో మంత్రి, ఎంపీ రహస్య సమావేశం అధికారపార్టీ నాయకులతో నాలుగు కమిటీలు భూసమీకరణను వ్యతిరేకిస్తే తరిమికొడతామన్న మంత్రి కొల్లు పోతేపల్లి, కోన గ్రామాల్లో ఎంఏడీఏ అధికారుల నిర్భందం మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణకు అనుకూలంగా టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. నయానో, భయానో రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతర, అంగీకార పత్రాలు తీసుకుంటున్న ఎంఏడీఏ (మడా) అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులకు అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. కోన గ్రామంలో భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదని అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులు ఆ మేరకు ధ్రవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వమంటే అధికారులు నిరాకరిస్తున్నారు. ఫారం-2 ఇచ్చిన రైతులకు ఆ పత్రం అందినట్లు సంతకం చేసి ఇవ్వాలని ఎక్కడా లేదని, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కోన డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన గ్రామానికి వెళ్లి ఎంఏడీఏ అధికారులతో మాట్లాడారు. ఫారం-2 ఇచ్చినట్లుగా సంతకం చేయాలని కోరగా తన వద్ద స్టాంపు లేదని మంగళవారం సంతకాలు చేస్తానని సుబ్బరాజు బదులిచ్చారు. అయితే సంతకాలు చేసిన తరువాతే గ్రామం నుంచి కదలాలని పంచాయతీ కార్యాలయం వద్ద సుబ్బరాజు, ఇతర సిబ్బందిని రైతులు నిర్భందించినంత పనిచేశారు. పోతేపల్లిలో రైతులు ఇచ్చిన అభ్యంతర ఫారాలు అందినట్లు డెప్యూటీ కలెక్టర్ బదులుగా తాను సంతకం చేస్తానని వీఆర్వో ప్రసాద్ చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆయన్ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పేర్ని నాని అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి వీఆర్వోను బయటకు తీసుకువచ్చారు. వెలువడని గడువుపెంపు ఉత్తర్వులు భూసమీకరణకు సంబంధించి అభ్యంతరాలు, అంగీకార పత్రాలు తీసుకునే గడువును నవంబర్ 4వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించినా సోమవారం సాయంత్రానికి కూడా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. డీఆర్డీఏ కార్యాలయంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ప్రకటించారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయం కాదు, జిల్లా వ్యవసాయశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తాం టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. తాను, ఎంపీ కొనకళ్ల నారాయణరావు నెల రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులను ఒప్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణకు అడ్డుపడే వారిని తరిమికొడతామన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. భూసమీకరణ ద్వారా భూములను ఇచ్చిన రైతులకు మెగా టౌన్షిప్లో ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ప్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు భూసమీకరణకు సిద్ధంగానే ఉన్నారని ఎంపీ చెప్పారు. టీడీపీ నేతలతో రహస్య భేటీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఆర్అండ్బీ అతిథిగృహంలో రహస్య సమావేశం నిర్వహించారు. భూసమీకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించే బాధ్యతను కీలకమైన నాయకులకు అప్పగించారు. ఇందుకు మండలంలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్‌తో కమిటీలను ఏర్పాటు చేసి వారికి కొంత మంది నాయకులను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. రైతులు భూసమీకరణకు అంగీకరించడం లేదని, భూమి కోల్పోతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భావిస్తున్నారని, అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ సక్రమంగా లేదని ఎంపీ, మంత్రి దృష్టికి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ నాయకులు తీసుకెళ్లారని సమాచారం. -
ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కొనకొళ్ల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడుగా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కొనకొళ్ల నారాయణరావు ఎన్నికయ్యారు. రెండు రోజల కిత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంట్లో జరిగిన సమావేశంలో కొనకొళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ పీఎస్ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం అధ్యక్షుడిగా కొనకొళ్ల పేరును కేఈ ప్రతిపాదించగా, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, గౌతు శ్యాంసుందర శివాజీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీహెచ్ వేణుగోపాలకృష్ణ ఆమోదం తెలిపారన్నారు. -
టీడీపీ లోక్‌సభ విప్‌గా కొనకళ్ల
సాక్షి, మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ లోక్‌సభ విప్‌గా బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఎన్నికయ్యారు. బుధవారం తిరుపతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కొనకళ్ల ఎంపికను ప్రకటించారు. బందరు లోక్‌సభనియోజకవర్గం నుంచి రెండో పర్యాయం ఎన్నికైన కొనకళ్లకు కీలకమైన విప్ పదవి రావటంపై ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. గతంలో ఎంపీగా విప్‌గా కొనకళ్ల పనిచేసిన కొనకళ్ల లోక్‌సభ చివరి సమావేశంలో రాష్ట్ర విభజన విషయంలో ఒత్తిడికి గురై పార్లమెంటులోనే గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన రెండో పర్యాయం మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కోస్తా జిల్లాల్లో బీసీ నేతగా ఎదిగిన కింజరాపు ఎర్రంనాయుడు లేని లోటును భర్తీ చేస్తూ టీడీపీ బీసీ నేత అయిన కొనకళ్లకు ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. -
'మచిలీపట్నం నుంచే మళ్లీ పోటీ చేస్తా'
మచిలీపట్నం లోక్‌సభ స్థానం తిరిగి తనకే కేటాయిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు భరోసా ఇచ్చారని ఎంపీ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... నవ్యాంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని నిర్మాణంతోపాటు ఆ ప్రాంత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నేతలు జంపింగ్ చేస్తుండటంతో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు తమకు మళ్లీ టికెట్ వస్తుందో రాదో అని సందేహంలో ఉన్నారు. నరసరావు పేట లోక్‌సభ స్థానాన్ని మరోకరికి కేటాయిస్తున్నట్లు ఇప్పటికే స్థానిక ఎంపీ మోదుగులకు చంద్రబాబు వెల్లడించారు. దాంతో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రస్తుత ఎంపీలు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టు ప్రదక్షణలు చేస్తూ, భజన చేస్తున్న సంగతి తెలిసిందే. అదికాక కొనకళ్ల నారాయణ విభజనపై పార్లమెంట్ లో ఆందోళన చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైయ్యారు. ఆ విషయం అన్ని మీడియాలలో ప్రముఖంగా వచ్చింది. నారాయణకు ప్రజల సానుభూతి ఉందని స్థానిక నేతలతోపాటు చంద్రబాబు భావిస్తున్నారు. విభజనకు అనుకూలంగా రెండు సార్లు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కొనకళ్లపై వచ్చిన సానుభూతితో క్యాష్ చేసుకోవచ్చని సదరు నాయకులు ఆలోచించినట్లు సమాచారం. అందుకే కొనకళ్లకు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఉత్సాహాం చూపిస్తున్నట్లు తెలిసిందే. రాష్ట్ర విభజన సందర్బంగా పార్లమెంట్లో చేపట్టిన ఆందోళనలో భాగంగా ఎంపీ కొనకళ్ల తీవ్ర అనారోగానికి గురైయ్యారు. దాంతో ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ని ముంబై తరలించారు. అక్కడ కొనకళ్ల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. -
టీడీపీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ రాజకీయం చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేయాలని చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం తిరుపతిలో డిమాండ్ చేశారు. తెలుగుదేశంపార్టీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన వ్యవహారంపై ప్రధానమంత్రి మౌనం వహించడం సరికాదని మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ తిరుపతిలో అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ కేంద్రమంత్రులు స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా చేయాలని కోడెల ఈ సందర్భంగా వారికి సూచించారు. రేపటి నుంచి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కోనకళ్ల నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ... తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరిన ఆమె స్పందించలేదని కోనకళ్ల నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
దేవినేని ఉమపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన వచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ స్పష్టం చేశారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ శనివారం విజయవాడులో వెల్లడించారు. విజయవాడలోని మాచవరంలో పోలీసు స్టేషన్లో ఉమపై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు అయిందని తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శనివారం ఉదయం విజయవాడ దేవినేని ఉమ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే అవనిగడ్డ ఉప ఎన్నిల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. కాగా దీక్ష చేసేందుకు ఉమ పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన్ని అక్కడి నుంచి మాచవరం పోలీసు స్టేషన్‌కు భారీ భద్రత నడుమ తీసుకువెళ్లారు.