
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర ఓటమికి తామే కారణమంటూ ప్రచారం చేయడాన్ని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తప్పుబట్టారు. ప్రజాకూటమి ఓటమిని తమ ఖాతాలో వేయొద్దంటూ విన్నవించారు. తెలంగాణలో ప్రచారానికి కట్టుబట్టలతో వచ్చిన తాము రాష్ట సమస్యలతోనే తీరిక లేకుండా ఉన్నామన‍్నారు. కేసీఆర్ మాటకారి.. ఆయన ఏదైనా మాట్లాడగలడని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
‘స్పీకర్ సుమిత్రా మహాజన్ తో జరిగిన సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. సమస్యలపై కేంద్రం స్పందించే తీరునుబట్టి నిరసన కార్యక్రమాలు చేస్తాం.రాష్ట్ర విభజన హామీలను అమాలు చెయ్యాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ లు చేస్తున్న చేస్తున్న దాడులపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాయకులను డీమోరలైజ్ చెయ్యడానికి దాడులు చేయిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మమ్మల్ని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం సహకరిస్తామని చెప్పడంతో వారితో కలిసాం. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’ అని కొనకళ్ల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment