దేవినేని ఉమపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు | Non Bailable case Filed Against TDP MLA Devineni Uma | Sakshi
Sakshi News home page

దేవినేని ఉమపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Published Sat, Aug 17 2013 2:37 PM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

Non Bailable case Filed Against TDP MLA Devineni Uma

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన వచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ స్పష్టం చేశారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ శనివారం విజయవాడులో వెల్లడించారు. విజయవాడలోని మాచవరంలో పోలీసు స్టేషన్లో ఉమపై నాన్ బెయిల్బుల్ కేసు నమోదు అయిందని తెలిపారు.

 

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శనివారం ఉదయం విజయవాడ దేవినేని ఉమ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే అవనిగడ్డ ఉప ఎన్నిల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. కాగా దీక్ష చేసేందుకు ఉమ పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయన్ని అక్కడి నుంచి మాచవరం పోలీసు స్టేషన్కు భారీ భద్రత నడుమ తీసుకువెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement