
సాక్షి, కృష్ణా: టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయి. బందరులో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బందరు మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ, అతడి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు మురళీ కృష్ణ.. పోలీసులను ఆశ్రయించాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.