bandaru
-
బండారు శ్రావణిపై పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావుకు విలేకరి బాలమురళీధర్ మంగళవారం ఫిర్యాదు చేశారు. శింగనమలలో ఇసుక అక్రమ రవాణాపై వార్తలు ప్రచురించడంతో తనపై బండారు శ్రావణి వర్గీయులు కక్ష కట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నగరంలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని, ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనను పరుష పదజాలంతో దూషిస్తూ ఎమ్మెల్యే అనుచరుడు బాబా ఫకృద్దీన్ వలి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నాడని వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఏదైనా జరిగితే దానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిదే పూర్తి బాధ్యత అంటూ ఫిర్యాదు చేశారు. -
Anantapur: శింగనమలలో బండారు లీలలు
సాక్షి అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ఒకరైతే.. పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారు. నియోజకవర్గ అభివృది, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడం.. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం సహజం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానాన్ని ఆమె తల్లి బండారు లీలావతి ఆక్రమించారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్లి లీలావతి శుక్రవారం బుక్కరాయసముద్రం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధికారితో పాటు ఇంజినీర్లు, ఇతర అధికారులు, ఎమ్మెల్యే వర్గీయులైన టీడీపీ నాయకులను పిలిపించారు. అందరినీ దగ్గర ఉండి అధికారులకు పరిచయం చేయించారు. అంతటితో ఆగకుండా ‘మండలంలో మా నాయకులు, కార్యకర్తలు మీ ఆఫీసులకు వస్తుంటారు. వారికి పనులు చేయడంతో పాటు వారు చెప్పిన వారికి మాత్రమే మీరు ప్రభుత్వం తరఫున సేవలందించాల’ని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పదవీ లేకున్నా అధికారులతో సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ
మచిలీపట్నం టౌన్: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపోగానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో చేరింది. 9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో..కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్ చేసిన మహిళే బెయిల్ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేకరించారు. గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకల్లా పోలీసులు శిశువును క్షేమంగా తల్లి స్వరూపరాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూపరాణి సంతోషం వ్యక్తం చేసింది. ఆడబిడ్డ కోసమని..!నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఎస్ఎన్సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ గార్డులకు చార్జ్ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
‘బండారు’ భూదాహానికి దివ్యాంగురాలి బలి
అనంతపురం: అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. నేటికీ భూ దందాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. గత ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రావణి తండ్రి బండారు రవి కుమార్ భూ దాహానికి తాజాగా ఓ దివ్యాంగురాలు బలైంది. తనకు జరిగిన మోసాన్ని ఆ అభాగ్యురాలు ఉరేసుకోబోతూ సెల్ఫీ వీడియోలో వివరించడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన నాగరాణి అలియాస్ రాజమ్మ (44) దివ్యాంగురాలు. ఆమెకు గ్రామ సర్వే నంబర్–218.2లో 3.67 ఎకరాల భూమి ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ భూమిని రాజమ్మ తల్లి సాకే నాగమ్మ తన చిన్నాన్న అయిన బండారు నారాయణస్వామి వద్ద రూ. 25 వేలకు కుదువ పెట్టింది. అయితే, రూ. కోటి విలువ చేసే ఈ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నారాయణ స్వామి కుమారుడు బండారు రవి కుమార్ భావించాడు. ఇటీవల నాగమ్మ మృతి చెందగా, కుదువ పెట్టిన భూమిని విడిపించుకునేందుకు 10 రోజుల క్రితం రూ. 25 వేలకు వడ్డీ, అసలు కలిపి రూ.1.25 లక్షలు తీసుకుని బండారు రవి కుమార్ ఇంటికి రాజమ్మ వెళ్లింది. అయితే, ఆ భూమి తమదని, వేరే వారికి అమ్మేస్తున్నామని ఆయన దౌర్జన్యం చేశాడు. దీంతో రాజమ్మ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. జరిగిన విషయాన్ని తన బంధువులతో చెప్పి బోరున విలపించింది. ఈ క్రమంలోనే గురువారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునికి బలవన్మరణానికి పాల్పడింది. ఉరేసుకునే ముందు తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోలో వివరించింది. శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బండారు శ్రావణి తండ్రి బండారు రవి కుమార్ తన భూమిని లాక్కున్నారని వాపోయింది. ఏవో మాటలు చెప్పి ఇటీవల తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపించింది. రాజమ్మ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు, ఎంపీటీసీ నాగేంద్ర సమాచారం మేరకు సీఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టు కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజమ్మ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..?
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ అట్టర్ ప్లాప్‌గా మారింది. ఆ పార్టీ నాయకులతో పాటు జనం నుంచి కూడా స్పందన లేకపోవడంతో టీడీపీ భవిష్యత్కే గ్యారెంటీ లేదని ప్రజలు అంటున్నారు. గార్లదిన్నె మండల పరిధిలోని ఇల్లూరులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రావణితో పాటు ఆమె వర్గం నాయకులు, కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో టీడీపీకి భవిష్యత్తు ఏది అని బహిరంగంగానే ప్రజలు గుసగుసలాడుకున్నారు. అడుగడుగునా అవమానాలే..... బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..? టీడీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయట పడింది. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినప్పటికీ టీడీపీలో అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రావణి గైర్హాజరైనట్లు సమాచారం. బస్సు యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎక్కడా శ్రావణి ఫొటో లేకపోవడం గమనార్హం. అలాగే కల్లూరు వైఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా జనం లేక వెలవెలబోయింది. పేరుకే బండారు శ్రావణి.. శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఎప్పట్నుంచో టీడీపీకి సేవలందిస్తోంది. కానీ ఈమెకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలోనే శ్రావణి తండ్రిపై ఇతర సామాజికవర్గ పెద్దలు దాడి చేశారు. గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయినా లోకేష్ దీనిపై స్పందించలేదు. అంతేకాదు నియోజకవర్గంలో పేరుకే శ్రావణి.. పెత్తనమంతా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి చేతుల్లోనే ఉండటంతో ఎస్సీలు రగిలిపోతున్నారు. చికెన్, మందు ఏర్పాటు చేసినా... షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే జనం రాకపోవడంతో ఆలస్యంగా మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమైంది. టీడీపీ నాయకులు బస్సుయాత్రకు వాహనాలు సమకూర్చిన జనం రాకపోవడంతో బస్సుయాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారింది. టీడీపీ నాయకులు నామమాత్రంగానే కార్యక్రమాన్ని జరిపించి మమ అనిపించారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు చికెన్, మందు ఏర్పాటు చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి. -
పేరుకే బండారు శ్రావణి.. అడుగడుగునా అవమానాలే..
టీడీపీ బడుగుల బలహీనవర్గాల నాయకులకు గడ్డు కాలం వచ్చింది. వీరిపై అగ్రవర్ణాల వారి పెత్తనం ఎక్కువైంది. అడుగడుగునా వివక్ష, అవమానాలతో ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోతోంది. పెత్తనం తారస్థాయికి చేరుతుండటంతో బడుగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో బడుగు, బలహీన వర్గాల నాయకులపై అణచివేత పెరిగిపోతోంది. 2019 ఎన్నికలకు ముందే ఆ పార్టీలో ఇమడలేక చాలామంది నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు టీడీపీలో ఎస్సీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు కోటరీగా చెప్పుకునే అగ్రకులాల వారే పెత్తనం చేస్తుండటంతో ఉన్న కొద్దిమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలూ ఇతర పారీ్టల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా పదిహేను రోజులపాటు నారాలోకేష్ పాదయాత్ర చేసినా.. తన కళ్లముందే ఎస్సీలపై దాడులు జరుగుతున్నా.. నోరు మెదపలేదు. పేరుకే బండారు శ్రావణి.. శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఎప్పట్నుంచో టీడీపీకి సేవలందిస్తోంది. కానీ ఈమెకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలోనే శ్రావణి తండ్రిపై ఇతర సామాజికవర్గ పెద్దలు దాడి చేశారు. గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయినా లోకేష్ దీనిపై స్పందించలేదు. అంతేకాదు నియోజకవర్గంలో పేరుకే శ్రావణి.. పెత్తనమంతా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి చేతుల్లోనే ఉండటంతో ఎస్సీలు రగిలిపోతున్నారు. మడకశిరలో ఈరన్నకు అవమానం ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు రిక్తహస్తం ఎదురైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామిని సమన్వయకర్తగా నియమించడంపై ఎస్సీలు రగిలిపోతున్నారు. తిప్పేస్వామి పారీ్టలు మారుతూ పదవులున్న చోటుకే వెళ్తుంటారని పేరు. ఇలాంటి వ్యక్తిని ఇక్కడ పెట్టి తమను ఏం చేయాలనుకుంటున్నారని ఈరన్న వర్గం కోపంతో ఉంది. ఇకపై తిప్పేస్వామి ఎవరికి చెబితే వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే ఈరన్న రెబల్‌గా మారే అవకాశం లేకపోలేదని సమాచారం. దాడులు జరుగుతున్నా దిక్కేది? ఇటీవల కళ్యాణదుర్గంలో ఎస్సీలపై దాడులు జరిగినపుడు.. సమీప నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. టీడీపీ నేత ఉన్నం మారుతీచౌదరి వర్గం ఓ దళితుడిపై దాడి చేసింది. బండారుశ్రావణి తండ్రిపై దాడిచేసినా లోకేష్ మాట మాత్రంగానైనా పరామర్శించకపోవడంతో ఎస్సీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. బీసీలనూ తొక్కేస్తున్నారు.. టీడీపీలో ఎస్సీ, ఎస్టీలనే కాదు బీసీలనూ తొక్కేస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఈడిగ వర్గానికి చెందిన బొమ్మగౌని కిరణ్‌కుమార్‌గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు. ముప్పై ఏళ్లుగా టీడీపీ కోసం కృషి చేసినా కనీసం అనుబంధ సంఘాల్లో కూడా స్థానం ఇవ్వలేదని, ఈ పార్టీ బీసీలను అణగదొక్కుతోందని ఆరోపించి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంకా తనలాంటి ఎందరో బీసీ నేతలు పార్టీలో నలిగిపోతున్నారని, త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు. మైనారీ్టల పరిస్థితీ అంతే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనార్టీల పరిస్థితి కూడా తెలుగుదేశం పారీ్టలో దారుణంగా ఉంది. 2014లో కదిరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అత్తార్ చాంద్‌బాషాను టీడీపీలోకి చేర్చుకుని అవసరానికి వాడుకుని ఇప్పుడు వదిలేశారు. అక్కడ కందికుంట ప్రసాద్ వైపే మొగ్గుచూపారు. కదిరిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. కానీ చాంద్‌బాషా స్వపక్షంలోనే విపక్షం లాగా కందికుంటతో రోజూ యుద్ధం చేయాల్సి వస్తోంది. -
AP: మాజీ ఎంపీ కొనకళ్లతో ప్రాణహాని ఉంది.. ఆవేదనలో బాధితుడు
సాక్షి, కృష్ణా: టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయి. బందరులో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బందరు మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ, అతడి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు మురళీ కృష్ణ.. పోలీసులను ఆశ్రయించాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. -
బందరులో టీడీపీ రౌడీ రాజకీయం
మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా బందరు మండలంలో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కత్తులు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన దాడిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి సంబంధించి 12 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం మండల పరిధిలోని గరాలదిబ్బలో కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు తరచూ గొడవలకు దిగేవారు. పలుమార్లు ఘర్షణలు జరిగి కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి ఒడుగు రాజ్‌కుమార్ బైక్‌పై వెళ్తున్నాడు. బహిర్భూమికి వెళ్లిన బొడ్డు నాగరాజు అటుగా వెళ్తుండగా అలికిడి వినిపించి రాజ్‌కుమార్ బైక్ లైట్‌ని అటువైపుగా తిప్పాడు. బహిర్భూమికి వస్తే నావైపు బైక్ లైట్ వేస్తావా? అంటూ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. పాతకక్షలను మనసులో పెట్టుకున్న నాగరాజు తన వర్గీయులతో ఆదివారం రాత్రి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో రాజ్‌కుమార్, ఆయన వర్గీయులపై దాడికి తెగబడ్డారు. మహిళలు, చిన్న పిల్లలని కూడా చూడకుండా రెచ్చిపోయినట్లు స్థానికులు చెప్పారు. నిరీక్షణరావు (24) భోజనం చేస్తుండగానే టీడీపీ శ్రేణులు బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. అదే విధంగా ఒడుగు నాగరాజు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ గాయాలపాలయ్యారు. పరిస్థితి విషమించడంతో నిరీక్షణరావును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. దాడికి పాల్పడిన బొడ్డు వీరవెంకటేశ్వరరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్నా), బొడ్డు దుర్గారావు, బొడ్డు నాగేశ్వరరావు, బొడ్డు బాల, బొడ్డు నాగరాజు, బొడ్డు ఏసురాజు, బొడ్డు వెంకటేశ్వరరావు (వెంకన్న), బొడ్డు ఏడుకొండలు (చంటి), బొడ్డు అభిరామ్ (రాజు), బొడ్డు వేణుగోపాలరావు (వేణు), బొడ్డు మోషేరాజుపై సెక్షన్ 307, 148, 143, 149 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ జి.వాసు వెల్లడించారు. -
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
ఎస్సై అర్జునరావుపై సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి : విజయవాడ బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించిన రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అర్జునరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం సీఎం జగన్ కాన్యాయ్ పైలెట్ ఆపీసర్గా విధులు నిర్వహిస్తున్న అర్జున రావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం లక్మీ అనే మహిళ కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావును పోలీసు ఉన్నతాధికారులు సైతం అభినందిస్తున్నారు. -
ట్రాఫిక్ ఎస్సై ధైర్యసాహసాలు.. ప్రశంసలు!
సాక్షి, విజయవాడ: ఓ ట్రాపిక్ ఎస్సై ధైర్యసాహసాలు ప్రదర్శించి.. చురుగ్గా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. సమయానుకూలంగా ధైర్యసాహసాలతో వ్యవహరించి.. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ట్రాఫిక్ ఎస్సై అర్జునరావుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సాహసాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా కొనియాడారు. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావుకు అభినందనలు తెలిపారు. ఆయన పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. -
అందరి చూపు.. బందరు వైపు!
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బందరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఈనెల 23న బందరులోని కృష్ణా యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్‌కు ముందురోజే జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి అటు అధికారులు, ఇటు సిబ్బంది.. ఇటు అన్ని పార్టీల నేతలు, వారి అనుయాయులు సిద్ధమవుతున్నారు. దీంతో బందరులో వీరి వసతి ఏర్పాట్ల వ్యవహారం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అధికారులకు సంబంధించి ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తి కాగా.. పార్టీలపరంగా ఎవరికి వారు తమతో వచ్చేవారి కోసం వసతి సౌకర్యానికి మల్లగుల్లాలు పడుతున్నారు. విందు కోసం ఆయా పార్టీల కార్యాలయాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. లాడ్జీలన్నీ ఫుల్! బందరులో కౌంటింగ్ జరగనున్న 9 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు బందరులో ఒక రోజు ముందుగానే మకాం వేసేందుకు సిద్ధం అవుతున్నారు. వీరితో పాటు అనుచరులను సైతం వెంటబెట్టుకుని రానుండటంతో ఏసీ గదులున్న లాడ్జిలు ఏమున్నాయని వెతుకులాటలో కొందరు పడగా.. మరి కొందరు మాత్రం ఇప్పటికే గదులు రిజర్వు చేసుకున్నారు. బందరు పట్టణంలో సుమారు 10 లాడ్జీలు ఉన్నాయి. వాటి పరిధిలో 250 నుంచి 300ల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. రూ.100 నుంచి రూ.5000ల వరకు ధర పలుకుతున్నాయి. అయినా డబ్బుకు ఎవరూ వెనకాడటం లేదు. దీంతో ఈనెల 22, 23వ తేదీల్లో అన్ని లాడ్జిల్లోని గదులన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. విందులు.. చిందులు! ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం తమ అనుచరులకు విందు ఏర్పాటు చేసేందుకు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల కార్యాలయాల్లో కొందరు, లాడ్జీల్లో కొందరు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులను జిల్లా కేంద్రం నుంచి తమ నియోజకవర్గం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. లెక్కింపునకు ఏర్పాట్లు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముఖ్య అధికారులకు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జరిగింది. అంతేగాక అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వారికి అవగాహన కల్పించారు. నిబంధనలపై ప్రశ్నావళి ఇచ్చి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లకు ఒక టేబుల్‌ను కేటాయిస్తున్నారు. -
ఇంకెన్నాళ్లిలా.?
సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. బందరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తూ చదువులు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలకు నేటికీ సొంత భవనాలు లేవు. చిలకలపూడి రైల్యేస్టేషన్‌కు సమీపంలో గల ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భవనాలను అద్దెకు తీసుకొని, అందులో కళాశాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరైన మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. కృష్ణాజిల్లా ,మచిలీపట్నం: మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను 2009లో ఏర్పాటు చేశారు. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బ్రాంచిలో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లను కల్పిస్తున్నారు. నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతో కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతున్నారు. గత ఏడాది మెకానికల్‌లో 95 శాతం, సివిల్ ఇంజినీరింగ్‌లో 85 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల నమోదులో రాష్ట్రంలో నాలుగో స్థానంలో మచిలీపట్నం కళాశాల నిలుస్తోంది. కళాశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు ప్రతిభ పురస్కారాలను కూడా అందుకున్నారు. పదేళ్లుగా పరాయి పంచన.. ఫలితాల్లో ఘనకీర్తిని సాధిస్తున్న పాలిటెక్నిక్ కళాశాల పదేళ్లుగా పరాయి పంచన కాలం వెళ్లదీస్తోంది. కలెక్టరేట్ సమీపంలోని ఆర్అండ్బీ శాఖకు చెందిన భవనాల్లో ఆరు ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ భవనాలు శిథిలావస్థకు చేరటంతో, అక్కడ నుంచి చిలకలపూడిలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలోని భవనాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. వసతులు కరువు.. నెలకు రూ. 23 వేలు వరకూ అద్దె చెల్లిస్తున్నప్పటకీ, ఇక్కడ కళాశాల నిర్వహణకు సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల, మరో పక్కన ఓ ప్రైవేటు సంస్థ ఉపాధి శిక్షణ, ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ, ఇలా అంతా గందరగోళంగా ఉంది. సరిపడా భవనాలు లేకపోవటంతో సాంకేతిక విద్యాబోధన కోసమని తీసుకొచ్చిన పరికరాలను కూడా వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సమస్యలతోనే చదువులు.. పాలిటెక్నిక్ కళాశాలలో సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతభవనాలు లేక తరగతుల నిర్వహణకు కూడా ఇబ్బందిగానే ఉందని అధ్యాపకులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక్కో బ్రాంచికి 60 మంది చొప్పున వాస్తవంగా ఇక్కడ 320 మంది విద్యార్థులు ఉండాలి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ నెలకొన్న ఇబ్బందులను చూసిన తర్వాత విద్యార్థులు చాలా మంది వేరే కళాశాలకు బదిలీ చేయించుకోవటం, మరికొంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కళాశాలలో 219 మంది విద్యార్థులు ఉన్నారు. కో–ఎడ్యుకేషన్ అయినప్పటికీ, కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి లేకపోవటంతో బాలికలు చేరేందుకు ఆసక్తి చూపటం లేదు. సరిపడా తరగతి గదులు అందుబాటులో లేకపోవటంతో కళాశాలకు చెందిన ఫర్నీచర్ ఆరుబయటనే పెడుతున్నారు. సామగ్రిని తరగతి గదుల్లోనే ఉంచుతున్నారు. డిజిటల్ తరగతుల నిర్వహణ సవ్యంగా జరగటం లేదు. నిధులు మంజూరయ్యాయి.. సొంత భవనాలు లేకపోవటంతో కళాశాల నిర్వహణ కొంత ఇబ్బందిగానే ఉంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం కృష్ణా యూనివర్సిటీ సమీపంలో 11.93 ఎకరాల భూమిని కేటాయించారు. భవనాల కోసం రూ. 9 కోట్లు మంజూరైనట్లుగా సమాచారం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.– ఎం. శార్వాణి, కళాశాల ప్రిన్సిపల్ -
తనిఖీలకొస్తే తలుపేశారు !
రికార్డుల తనిఖీలకు వచ్చిన విజిలెన్స్ అధికారులకు ఎవరైనా ఏం చేస్తారు.. రికార్డులు చూపించి సహకరిస్తారు. కానీ బందరు మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రికార్డులు చూపించడం సంగతి అటుంచితే.. కనీసం తలుపులు కూడా తీయలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ ఒక్క వ్యవహారం చాలు ఆశాఖలో ఏ మేరకు అవినీతి రాజ్యమేలుతోందో తెలిపేందుకు అని పరిశీలకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాక్షి, మచిలీపట్నం: 2016–17 ఆర్థిక సంవత్సరంలో బందరులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకంలో జోన్–2 పరిధిలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రూ.5 కోట్లు వెచ్చించి చేపట్టిన పనుల్లో నిబంధనలు తోసిరాజని, ధనార్జనే ధ్యేయంగా ముందుకు కదిలారు. నాసిరకం నిర్మాణాలతో రూ.లక్షలు దిగమించారు. ఈ అక్రమ తంతుపై ఇటీవల ‘నిధులు గుల్ల.. పనులు డొల్ల.’ అనే శీర్షికతో ఈనెల 24 ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దోపిడీ పర్వంపై విశ్లేషణతో కూడిన కథనానికి విజిలెన్స్ అధికారులు స్పందించారు. ఈ అక్రమ బాగోతం గుట్టురట్టు చేసేందుకు రికార్డులు తనిఖీ నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగానే మంగళవారం బందరు మున్సిపల్ కార్యాయానికి వెళ్లారు. ముఖం మీదే తలుపేశారు.. ఇప్పటికే బాక్స్ టెండర్ల అంశంలో అవినీతిని మూటగట్టుకున్న విషయం తెలిసింది. తాజాగా ‘సాక్షి’ కథనం సైతం కలకలం రేపింది. ఇదే సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమ తంతుపై కథనం ప్రచురితం కావడంతో విజిలెన్స్ అధికారులు నిజాలు నిగ్గుతేల్చేందుకు మంగళవారం మచిలీపట్నంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పాలకవర్గం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రస్తుతం అధికారులకు సహకరించి రికార్డులు సమర్పిస్తే తమ బండారం బయట పడుతుందని భావించారు. ఎలాగైనా తప్పించుకునేందుకు ఎత్తుగడ వేశారు. అప్పుడే ఓ ఉపాయానికి తెర తీశారు. ఎలాగో వైఎస్సార్ సీపీ బంద్ కొనసాగుతోందని, బంద్ ముసుగులో మస్కా కొట్టాలని తలంచారు. అనుకున్నదే తడువుగా వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. ఇందులోనే మున్సిపల్ అధికారులు రెవెన్యూ సెక్షన్‌కు చేరుకున్నారు. అక్కడే అసలు కథ ప్రారంభమైంది. అక్కడికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు తలుపు వద్దకు వెళ్లగా ఒక్కసారిగా మూసేశారు. అదేమని ప్రశ్నించగా.. ఈ రోజు రాష్ట్ర బంద్ కొనసాగుతోందని, ప్రస్తుతం కార్యాలయం తెరిస్తే.. ఆందోళన కారులు కార్యాలయంలోకి ప్రవేశిస్తే నష్టం జరుగుతుందని, అందుకే తలుపులు మూసేస్తున్నామని నమ్మబలికారు. బంద్ అనంతరం బుధవారం వస్తే మీకు సహకరిస్తామని చెప్పినట్లు సమచారం. తాము విజిలెన్స్ అధికారులమని చెప్పినా పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉదయం వచ్చిన విజిలెన్స్ అధికారులు గంటలకొద్దీ అక్కడే కూర్చున్నా లాభం లేకుండా పోయింది. ఎంతకూ ఏ ఒక్క అధికారి సైతం సహకరించకపోవడంతో చేసేది లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం అధికారులకు సహకరించలేదంటే మున్సిపాలిటీలో ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. విజిలెన్స్ అధికారులకు సహకరించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేనున్నప్పుడు వస్తామన్నారు బందరు మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం విజిలెన్స్ అధికారులు వచ్చిన మాట వాస్తవమే. అయితే బంద్ కావడంతో ఆ రోజు నేనే విధులకు హాజరు కాలేదు. నేను కార్యాలయంలో ఉన్న రోజు వస్తామని మా సిబ్బందితో చెప్పి వారు వెళ్లిపోయారు. – సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
కోస్తా తీరం.. ఫలహారం!
సాక్షి, అమరావతి బ్యూరో: ‘దేశంలో ఏ రాష్ట్రానికీ లేనంత సువిశాల సముద్ర తీర ప్రాంతం మన బలం... దాన్ని ఆలంబనగా చేసుకుని అపార అవకాశాలు సృష్టిస్తాం.. విశాఖ నగరాన్ని ఏపీలో ఐటీ సంస్థలు కొలువుదీరే కేంద్రంగా మారుస్తాం..’ అని తరచూ చెప్పే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడా సాగర తీరాన్ని ఫలహారంలా పంచిపెట్టేందుకు ప్రణాళిక రచించారు. విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా–గుంటూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని దాదాపు 200 కి.మీ. తీరప్రాంతాన్ని తమవారికి కట్టబెట్టేందుకు ముఖ్యనేత రంగంలోకి దిగారు. అందుకు అడ్డుగా ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్లను (సీఆర్‌జెడ్) మార్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహంతో తీరప్రాంతం విధ్వంసానికి గురై ప్రకృతి విపత్తులకు దారి తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో మరో ఘోరం.. కోస్తా తీరంలో విస్తారంగా ఉన్న భూములపై దృష్టి సారించిన ప్రభుత్వ ముఖ్యనేత పర్యాటకాభివృద్ధి, ఐటీ రంగానికి ప్రోత్సాహం పేరుతో అస్మదీయ సంస్థలకు స్టార్‌హోటళ్లు, రిస్టార్టులు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖలోని కైలాసగిరి– విజయనగరం జిల్లా పూసపాటిరేగ, కృష్ణా జిల్లా బందరుతోపాటు కావలి నుంచి తడ వరకు అంటే 200 కి.మీ. మేర తీరప్రాంతం అప్పగించేందుకు పథకం వేశారు. వాస్తవానికి ఆ ప్రాంతమంతా సీఆర్‌జెడ్–3 కేటగిరీ కిందకు రావటంతో నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. జోన్లు మార్చేస్తే సరి... తీరాన్ని అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ముఖ్యనేత విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చాలని ఆదేశించారు. దీనివల్ల పరిమితస్థాయిలో నిర్మాణాలకు అవకాశం కలుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని 200 కి.మీ. పొడవునా భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేసి పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టవచ్చనేది ముఖ్యనేత వ్యూహం. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చూసీచూడనట్టు ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వుడాకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వుడా, ముడా, నుడా... సరే విశాఖలోని కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా పూసపాటిరేగ వరకు ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–3 నుంచి సీఆర్‌జెడ్–2గా మార్చాలని మాస్టర్‌ప్లాన్‌లో వుడా ప్రతిపాదించింది. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా), నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా)లు కూడా తమ పరిధిలోని సీఆర్‌జెడ్–2 ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–3గా మార్పులు చేయడానికి సన్నాహాలు చేపట్టాయి. పురపాలక శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. నిబంధనలకు విరుద్ధమే.. 200 కి.మీ. పొడవున తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చడం నిబంధనలకు విరుద్ధం. కేవలం తీరాన్ని ఆనుకుని నగరాలు, పట్టణాలు ఉన్న ప్రాంతంలో మాత్రమే సీఆర్‌జెడ్–2 కేటగిరీ కిందకు చేర్చాలి. భూగర్భ డ్రైనేజీ, నీటిశుద్ధి ప్లాంటు తదితరాల కోసం ఆ వెసులుబాటు కల్పించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న చోట అవేవీ లేవు. పైగా విశాఖకు చేరువలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలున్నాయి. తీరప్రాంతంలో తుపాన్ల తీవ్రతను తగ్గించే మడ అడవులు కూడా ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా విలువైన తీరప్రాంతాన్ని అప్పనంగా పంచేస్తే తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీఆర్‌జెడ్’ చట్టం సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం తీరప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు. తీరంలో ఇసుక ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–1గా ప్రకటించారు. ఈ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం జెట్టీలు, పోర్టులు, ఇతర మత్స్యకార సామాజిక కార్యక్రమాలే చేపట్టాలి. సముద్ర కెరటాలు అత్యంత ముందుకు వచ్చే ప్రాంతం (హైటైడ్ లైన్Œæ) నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్ ప్రాంతంగా ప్రకటించారు. సముద్రతీరంలో ఉండే నగరాలు, పట్టణాల కోసం మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చారు. అందుకోసం 500 అడుగుల సీఆర్‌జెడ్ ప్రాంతాన్ని మళ్లీ రెండుగా విభజించారు. దీని ప్రకారం నగరాలు, పట్టణాలు ఉన్న చోట హైటైడ్ లైన్ నుంచి 200 అడుగుల వరకు సీఆర్‌జెడ్–2గా ప్రకటించారు. ఆ పరిధిలో నగరాల మురుగునీటి కాలువలు, నీటి శుద్ధి ప్లాంట్లు కోసం పరిమిత స్థాయిలో నిర్మాణాలను అనుమతించారు. హైటైడ్ లైన్‌కు 200 అడుగుల నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్–3గా ప్రకటించారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. -
లక్షల ఎకరాల్లో వరి ఎండుతోంది: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోతోందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆయా శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలపై దత్తాత్రేయ శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతేడాది మిరప క్వింటాలుకు రూ.14 వేలు ధర పలికితే, ఇప్పుడు కేవలం రూ.4 వేలకే రైతు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. మిరపను రూ.7–8 వేలకు కొనుగోలు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి చర్చిస్తానన్నారు. అలాగే, మిరప రైతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. పంట రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య సయోధ్య లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ. 4 వేల కోట్లు కోరిందని, ఇది కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు దత్తాత్రేయ తెలిపారు. 10 కోల్డ్‌స్టోరేజీలు మంజూరుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరినట్లు ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలోని రూ.180 కోట్ల పుర ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. -
నేడు బందరులో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు బందరులో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకుంటారని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ మంగళవారం తెలిపారు. బందరు పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల కోసం భూసేకరణలో ఉన్న గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని ఆయన వివరించారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం మండలంలోని కరగ్రహారానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి ఫరీద్‌బాబా దర్గా సెంటర్ వద్ద రైతులతో, గ్రామస్తులతో మాట్లాడతారని చెప్పారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చేరుకొని వినాయకుడి గుడి సెంట ర్లో రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి పొట్లపాలెం చేరుకొని పంచాయతీ కార్యాలయం సెంటర్లో రైతులతో మాట్లాడతారన్నారు. అక్కడి నుంచి తిరుగు పయనమై గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదుకు వెళతారని తలశిల రఘురామ్ తెలిపారు. -
బందరు అభివృద్ధికి సమష్టి కృషి : మంత్రి కొల్లు
మచిలీపట్నం టౌన్ : బందరు ప్రాంత అభివృద్ధికి సమష్టిగా పని చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యాన ఆదివారం ఆలయ ప్రాంగణంలో మంత్రి, మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు సూర్యనారాయణ, శ్రీరాములు అమ్మవారి సమక్షంలో వీరికి ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ బందరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బందరు అభివృద్ధికి సహకరించే పోర్టు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని నియోజకవర్గ సమీక్షలో ప్రతిసారి చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. అలాగే కోస్తాతీరంలో నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు వినతి పంపారన్నారు. బందరు పట్టణంలో తాగునీటి వసతి, డ్రెయిన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనపై నియోజకవర్గ ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించారని, అలాగే చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వడం, మునిసిపాలిటీ, మండల పరిషత్‌లను ప్రజలు తమ పార్టీకే అప్పగించడంతో తన బాధ్యతను మరింత ఎక్కువ చేశారన్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పనిచేస్తానని రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మారుతీదివాకర్, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, బచ్చుల అర్జునుడు, బూరగడ్డ రమేష్‌నాయుడు, గొర్రెపాటి గోపీచంద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు సామ కాంతారావు, సహాయ కార్యదర్శి బైసాని హయగ్రీవరావు, కోశాధికారి ఉడత్తు శ్రీనివాసరావు, ఆర్యవైశ్య ప్రముఖులు గుడివాడ రామచంద్రరావు, తాడేపల్లి మెహర్‌బాబా,జంగాల హరనాథ్‌బాబు, బెల్ ఏజీఎం డీ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి కొల్లు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కౌన్సిలర్లను ఆలయ మర్యాదలతో పూర్ణకుంభాలతో వేద పండితులు స్వాగతం పలికారు.