వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకుంటారని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ మంగళవారం తెలిపారు. బందరు పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల కోసం భూసేకరణలో ఉన్న గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని ఆయన వివరించారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం మండలంలోని కరగ్రహారానికి చేరుకుంటారని తెలిపారు.
Published Wed, Sep 16 2015 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement