టీడీపీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ రాజకీయం చేసింది | congress politicized TDP MPs resignation, says N.siva prasad | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ రాజకీయం చేసింది

Published Sun, Aug 25 2013 2:29 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress politicized TDP MPs resignation, says N.siva prasad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేయాలని చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం తిరుపతిలో డిమాండ్ చేశారు. తెలుగుదేశంపార్టీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన వ్యవహారంపై ప్రధానమంత్రి మౌనం వహించడం సరికాదని మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ తిరుపతిలో అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ కేంద్రమంత్రులు స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామా చేయాలని కోడెల ఈ సందర్భంగా వారికి సూచించారు.

 

రేపటి నుంచి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు మచిలీపట్నం లోక్సభ సభ్యుడు కోనకళ్ల నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ... తమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తి వేయాలని లోక్సభ స్పీకర్ను కోరిన ఆమె స్పందించలేదని కోనకళ్ల నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement