MPs resignation
-
మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయుల రాజీనామా
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు చెలరేగాయి. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్లో ఆందోళనకారులు పాటిల్‌ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించడంపై పాటిల్ మండిపడ్డారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టలేదు. రెండు-మూడు తరాలు అధికారంలో ఉన్నారు. వారే చొరవ తీసుకుని ఉండేవారు. కానీ అదేమీ చేయలేదు. మరాఠా సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ వర్గానికి ఏం చేయలేదు" అని పాటిల్ మండిపడ్డారు. మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు' -
బ్రిటన్ లేబర్ పార్టీలో చీలిక
లండన్: బ్రెగ్జిట్, యూదు వ్యతిరేక వాదం అంశాలపై బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ అనురిస్తున్న విధానాలకు నిరసనగా ఏడుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. లేబర్ పార్టీకి రాజీనామా చేశామనీ, పార్లమెంటులో ఓ ప్రత్యేక స్వతంత్ర బృందంగా తాము వ్యవహరిస్తామని ఏడుగురు ఎంపీలు చెప్పారు. ఎంపీలు చుకా ఉమున్నా, లూసియానా బర్జర్, క్రిస్ లెస్లీ, ఎంజెలా స్మిత్, మైక్ గేప్స్, గావిన్ షుకర్, అన్నే కోఫీ మీడియాతో ఈ విషయం చెప్పారు. యూదులపై మత విద్వేషం, వారిని గేలి చేయడం, భయపెట్టడం వంటివి భరించలేక, బ్రెగ్జిట్‌పై పార్టీ వైఖరి నచ్చక తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని బర్జర్ తెలిపారు. తమకు సొంత పార్టీ పెట్టే ఆలోచనేదీ లేదన్నారు. కాగా, 1981లో నలుగురు లేబర్ పార్టీలో ప్రధాన నేతలు పార్టీ నుంచి బయటకొచ్చి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత లేబర్ పార్టీలో వచ్చిన అతి పెద్ద చీలిక ఇదే కావడం గమనార్హం. ఫేస్బుక్.. ఓ డిజిటల్ గ్యాంగ్‌స్టర్ నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం నియంత్రణలో ఫేస్బుక్ వ్యవహారశైలిపై బ్రిటన్ పార్లమెంటు కమిటీ మండిపడింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ను ‘డిజిటల్ గ్యాంగ్‌స్టర్’గా కమిటీ అభివర్ణించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో ఏర్పాటైన హౌస్ ఆఫ్ కామన్స్ డిజిటల్ కల్చర్, మీడియా, స్పోర్ట్(డీసీఎంఎస్) సెలక్షన్ కమిటీ 18 నెలల విచారణ అనంతరం నివేదికను సమర్పించింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బ్రిటన్ పార్లమెంటు ముందు హాజరుకాకుండా ధిక్కారానికి పాల్పడ్డారని కమిటీ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్బుక్ లాంటి డిజిటల్ గ్యాంగ్ స్టర్లను చట్టానికి అతీతంగా వ్యవహరించేందుకు అనుమతించరాదని అభిప్రాయపడింది. సీఏ మాతృసంస్థ ఎస్సీఎల్, దాని అనుబంధ సంస్థలు భారత్, పాక్, కెన్యా, నైజీరియా ఎన్నికల కోసం నైతికతను ఉల్లంఘించి పనిచేశాయని తెలిపింది. -
టీఆర్ఎస్లో రాజీనామాల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. తాము పార్టీ మారుతున్నామనే ప్రచారం వట్టిదేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. వీరిద్దరూ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ మైండ్‌గేమ్ ఆడుతోందని చెప్పారు. అలాంటి ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదని మంత్రి కేటీఆర్ ఎంపీలకు సూచించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ప్రకటించిన జాబితాలో చోటు దక్కని ఆశావహులు విజయారెడ్డి (ఖైరతాబాద్), శంకరమ్మ (హుజూర్నగర్) సైతం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చొరవతో శంకరమ్మ, ఆమె కుమారుడు వచ్చి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉంటాయని కేటీఆర్ ఈ సందర్భంగా శంకరమ్మకు చెప్పారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించిన విజయారెడ్డికి కూడా ఇదే హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని వారు చెప్పారు. ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఎన్నికల ప్రచారంలో విజయారెడ్డిని, మన్నె గోవర్ధన్‌రెడ్డిని కలుపుకుని పోవాలని మంత్రి కేటీఆర్ దానంకు సూచించారు. కోదాడలో శశిధర్‌రెడ్డి! టీఆర్ఎస్ కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కోదాడ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అసంతృప్త నేత బొల్లం మల్లయ్యయాదవ్‌ను పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో మల్లయ్యయాదవ్ వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. శుక్రవారం మల్లయ్యయాదవ్ టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి శశిధర్‌రెడ్డికి ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరిద్దరి పేర్లు ప్రకటించిన తర్వాతే 12 మంది అభ్యర్థులకు ఒకేసారి బీఫారాలు ఇవ్వనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌కు రావాలని వారికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దేశపతి రాజీనామా సీఎం కేసీఆర్ ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా దేశపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్‌వి చిల్లర వేషాలు: సీతారాంనాయక్ రేవంత్‌రెడ్డి ఏంటో అందరికీ తెలుసు. చిల్లర వేషాలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్‌కోసం పనిచేసే వాళ్లను ఆత్మరక్షణలో పడేసే ఆటలు వద్దు. నేను టీఆర్ఎస్ను వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇలాంటి వార్తలు రాసే ముందు మీడియా ఒకసారి ఆలోచించాలి. నేను జయశంకర్‌సార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశాను. విద్యార్థులకు అండగా నిలిచాను. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మహబూబాబాద్ ఎంపీగా గెలిచాను. రేవంత్‌రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. నాపై దుష్ప్రచారం: విశ్వేశ్వర్‌రెడ్డి రేవంత్‌రెడ్డి కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను టీఆర్ఎస్కు రాజీనామా చేశాననే వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌తోనూ మాట్లాడాను. ఈ విషయంలో టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు. -
‘రాజీనామాల ఆమోదం హర్షణీయం’
సాక్షి, అమరావతి : రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం హర్షణీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సూచించారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఎంపీలు ముగ్గురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం విదితమే. ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. -
ఒకటే మాట.. ఒకటే బాట
సాక్షి, అమరావతి: ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో తొలి నుంచీ రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడంతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. ‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు – ప్యాకేజీలతో మోసం చేయొద్దు’ అంటూ నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకోన్ముఖంగా పోరాడుతున్నది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, అదొక్కటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నిరుద్యోగ యువత భవితకు బాటలు వేస్తుందని గట్టిగా విశ్వసించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను స్వయంగా అమరణ నిరాహారదీక్ష చేయడంతో పాటు ఉద్యమంలో వాడి వేడీ ఏ మాత్రం చల్లారకుండా ఎప్పటికప్పుడు అనేక పోరాటాలు సాగిస్తూ వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పలు రకాల రాయితీలు వస్తాయని... రాయితీలొస్తే వేలల్లో పరిశ్రమలొస్తాయని.... పరిశ్రమలొస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని జగన్ ప్రజల్లో చైతన్యం రగిలించారు. బీజేపీతో కలసి అధికారం పంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా పట్టుబట్టి అడిగిందే లేదు. జగన్ మాత్రం అవకాశం ఉన్న వేదికలన్నింటిపైనా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు. అమరావతి నుంచి ఢిల్లీ దాకా ప్రత్యేక హోదా వాణిని వినిపించారు. గుంటూరులో 2015 అక్టోబర్ 7వ తేదీ నుంచి అమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది. ఆ తరువాత జగన్ మరో అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా కోసం నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టడానికైనా సిద్ధమని ప్రకటించారు. జనంలో భావోద్వేగాలతో బాబు యూటర్న్ ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకు పోతూండటంతో అప్పటి దాకా ‘ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కిన ముఖ్యమంత్రి ఒక్కసారిగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ‘యూటర్న్’ తీసుకున్నారు. హోదా కావాలంటూ తాము నిర్ణయించిన ప్రజా ఎజెండాను చంద్రబాబు కూడా అనుసరించక తప్పని పరిస్థితులను జగన్ కల్పించారు. పార్లమెంటు సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు ... ఆదరాబాదరా ఎన్డీయే ప్రభుత్వం నుంచి తన మంత్రులను వైదొలగింప జేయడంతో పాటుగా రాజకీయంగా తెగదెంపులు చేసుకుని తన ఎంపీల చేత చంద్రబాబు కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసును ఇప్పించారు. నాలుగేళ్ల తరువాత ప్రత్యేక హోదా వద్దు... ప్యాకేజీ ముద్దు అన్న నోటి నుంచే చంద్రబాబు హోదా కోసం సై అనాల్సి వచ్చింది. ప్రతిపక్షం నిర్ణయించిన ఎజెండానే చంద్రబాబు అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ ఘనత ప్రతిపక్ష నేత జగన్దేననే ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి. ఎవరెంతగా ప్రజలను మభ్యపెట్టాలని చూసినా ప్రత్యేకహోదాయే సంజీవని, అదే మా ఊపిరి అంటూ జగన్ ధృఢంగా నిలబడ్డారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేయని పోరాటం లేదు. ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్ర బంద్‌లు నిర్వహించారు. చివరకు ఆమరణ దీక్ష కూడా చేశారు. తుదిదశ పోరాటంలో భాగంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, అన్ని పక్షాల సంఘీభావాన్ని సంపాదించి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. పార్లమెంటు బడ్జెట్‌సమావేశాలు ముగిసే వరకు హోదా కోసం పోరాటం కొనసాగిస్తూనే చివరి రోజున ఎంపీలు రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకున్నారు. కేంద్ర పెద్దలకు వినతులు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నాలుగేళ్లుగా దశల వారీగా ఉద్యమాన్ని నడిపించారు. హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే నరేంద్రమోదీని 2014, మే 19న పార్టీ ఎంపీలతో కలసి.. ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రాజధానికి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 10 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ అలక్ష్యం వల్ల హోదా, విభజన హామీల అమలులో ఆలస్యం జరుగుతుండటంతో మళ్లీ 2015, మార్చి 30న, 2017 మే 10న ప్రధానిని కలిశారు. 2015 జూన్ 11న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, 2016 ఏప్రిల్ 26న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలసి విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు. యువతలో చైతన్యం నింపేందుకు.. హైదరాబాద్‌ను కోల్పోయిన రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కోల్పోయింది. ప్రత్యేక విమానాల్లో రూ.కోట్లు వెచ్చించి దేశాలు తిరగడమే తప్ప ఒక్క పరిశ్రమనూ చంద్రబాబు తీసుకురాలేకపోయారు. ప్రత్యేక హోదా ఉంటే వచ్చే రాయితీలను చూసి పరిశ్రమలు వాటంతటవే తరలివస్తాయని జగన్ యువతకు అర్థమయ్యేలా వివరించారు. ముఖ్య పట్టణాలన్నిటిలోనూ యువభేరి సదస్సులు నిర్వహించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. యువభేరి సదస్సులకు విద్యార్థులను పంపితే అరెస్టులు చేయిస్తామని తల్లిదండ్రులను బెదిరించారు. పీడీ యాక్టులు పెడతామన్నారు. అయినా వెరవక యువత భారీ స్థాయిలో యువభేరి సదస్సులకు పోటెత్తింది. ధర్నాలు, దీక్షల బాట ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షల బాట పట్టారు. మొదటగా 2014 డిసెంబర్ 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. తర్వాత 2015 జూన్ 3న మంగళగిరిలో రెండు రోజుల సమరదీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టులో ఢిల్లీలో తొలిసారిగా జగన్ ఒక రోజు ధర్నా చేశారు. మళ్లీ ఆగస్టు 29న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వగా ప్రజలందరి మద్దతు లభించింది. రాష్ట్రపతితో భేటీలు కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సైతం (జూన్ 9, 2015, ఫిబ్రవరి 23, 2016, ఆగస్టు 8, 2016) మూడుసార్లు కలసి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే మూడేళ్లలో పూర్తి చేసేలా చూడాలని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వేళ.. జగన్ 2015 అక్టోబర్‌లో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ప్రధాని మోదీ ఏపీకి రానుండడంతో.. ఏపీ ఆకాంక్ష గురించి ఆయన గ్రహిస్తారని అంతా భావించారు. కానీ ఏడో రోజున రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేసింది. ఆ తర్వాత జగన్ పిలుపుతో అక్టోబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేశాయి. మలిదశ పోరులో భాగంగా 2016, మే 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. కాకినాడలో జరిగిన నిరసనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా పాల్గొన్నారు. అదే ఏడాది ఆగస్టు 2న, సెప్టెంబర్ 10న రాష్ట్రబంద్ నిర్వహించారు. ఉక్కుపాదానికి ఎదురొడ్డి నిలిచి.. ప్రత్యేక హోదా అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం తట్టుకోలేని చంద్రబాబు హోదా పోరుపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. హోదాకు మద్దతుగా విశాఖలో 2017 జనవరి 26, 27 తేదీల్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరవడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను అప్రజాస్వామికంగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా రన్‌వేపైనే జగన్ బైఠాయించారు. అదే ఏడాది నవంబర్‌లో వైఎస్సార్సీపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా.. ప్రభుత్వం అడ్డుకుంది. హోదాపై చంద్రబాబు పూటకో మాట ఏప్రిల్ 29, 2014: మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇచ్చారు. నేను మోదీగారిని కోరుతున్నా. 15 ఏళ్లు ఇవ్వండి. తిరుపతిలో ఎన్డీఏ సభలో చంద్రబాబు ఆగస్టు 25, 2015: ప్రత్యేక హోదా సంజీవని కాదు. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మే 17, 2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? మే 18, 2016: హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విన్నవించా. సెప్టెంబర్ 8, 2016: ప్రత్యేక హోదా వీలుకాదు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామని చెబుతుంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం? సెప్టెంబర్ 9, 2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా. సెప్టెంబర్ 10, 2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.. కేంద్రం చెప్పినదానికంటే అదనంగా ఏమొస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. సెప్టెంబర్ 15, 2016: హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు. సెప్టెంబర్ 19, 2016: హోదా ప్యాకేజీకి సమానం. అందుకే అంగీకరించాం. సెప్టెంబర్ 26, 2016: హోదా అంటే జైలుకే.. విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్.. అక్టోబర్ 28, 2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు జనవరి 25, 2017: హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎక్కడుంది? ఏ జీవోలో ఉందో చూపండి. హోదాకు, రాయితీలకు సంబంధం లేదు. ఫిబ్రవరి 3, 2017: హోదా వేస్ట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. ఫిబ్రవరి 15, 2017: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు. మార్చి 15, 2017: సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేక సాయానికి కేంద్రం ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం. మార్చి 16, 2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం. మార్చి 7, 2018: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ అవమానకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం కింద ఇస్తామని అప్పుడు ప్రకటించారు. అవి కూడా సరిగా ఇవ్వలేదు. మార్చి 8, 2018: కేంద్ర మంత్రివర్గం వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు. మార్చి 10, 2018: వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వం. మార్చి 15, 2018: వైఎస్సార్సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొంతమంది కావాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. (అసెంబ్లీలో) మార్చి 16, 2018: మేమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. వైఎస్సార్సీపీ పెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వం (టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో) మార్చి 24, 2018: హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకిచ్చిన రాయితీలు ఇస్తే ఓకే. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : పదవీ త్యాగానికి ఆమోదం ‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
-
‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’
సాక్షి, హైదరాబాద్ : విభజన హామీల అమలు, ప్రత్యే హోదా విషయంలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఎంపీ పదవులకు రాజీనామా చేశామని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజీనామా అనంతరం ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు కూర్చున్నాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించిన మార్గంలోనే నడిచి ఏపీకి హోదా కోసం రాజీనామా చేశాం. మా రాజీనామాల ఆమోదం కచ్చితంగా టీడీపీకి చెప్పుదెబ్బ. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు ఎంపీ పదవులు వదులుకున్నారు. కానీ టీడీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి పదవులు అనుభవించారు. ఇప్పటికీ టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదంటే.. పదవులు లేకుంటే వారు ఒక్కరోజు కూడా ఉండలేరని ఏపీ ప్రజలు గుర్తించారని’ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మా రాజీనామాలు ఆమోదించినందుకు చాలా సంతోషంగా ఉంది. 13సార్లు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాణాలు ప్రవేశపెట్టాం. ఈ విషయంపై రాష్ట్రపతిని కలిశాం. చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగాం. ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటాం. ఓటమి భయంతోనే టీడీపీ మాపై బురద చల్లుతోంది. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదాను అవహేళన చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకున్నారు. హోదా ఉద్యమం ఉధృతం కావడంతో బాబు తన అలవాటు ప్రకారం యూటర్న్ తీసుకున్నారని’ మాజీ ఎంపీ వరప్రసాద్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి హోదాను తీసుకురాలేక పోయారని టీడీపీ వైఫల్యాలను వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎండగట్టారు. సీఎం చంద్రబాబు ఓవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మరోవైపు నీతులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం శారు. బీజేపీతో కలిసి చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హోదాపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తున్నారని మేకపాటి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో హోదాను కచ్చితంగా సాధించి తీరుతామని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలను అందించే హోదాను అవహేళన చేసి చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడటం వల్లే ఎన్నో నష్టపోయామన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలు ఆమోదం పొందాయి. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు సమర్పించిన లేఖలు ఆమోదం పొందినట్లు స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కాగా, గత నెలలో ఇచ్చిన రాజీనామా లేఖలపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని, రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి వైఎస్సార్సీపీ నేతలు వివరించారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సుమిత్రా మహాజన్ కోరినా... హోదా పోరులో వైఎస్సార్సీపీ నేతలు వెనక్కి తగ్గక పోవడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మే చివర్లో రాజీనామాలపై మరోసారి పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించగా... తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామాలు ఆమోదించాలని పట్టుబట్టి మరీ వైఎస్సార్సీపీ నేతలు తమ రాజీనామాలు ఆమోదించేలా చేసి నైతిక విజయం సాధించారు. రాజీనామాలపై రాతపూర్వకంగా మరోసారి నిర్ణయాన్ని(రీ కన్ఫర్మేషన్) తెలపాలని స్పీకర్ సూచించడంతో ఆ మేరకు ఎంపీలు లేఖలు సమర్పించారు. ‘‘16వ లోక్‌సభ సభ్యత్వానికి నేను 2018 ఏప్రిల్ 6న రాజీనామా చేశాను. ఈ రాజీనామాపై పునరాలోచించాలని మే 29న మీరు(స్పీకర్) సూచించారు. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. నేను ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. ఎంపీ పదవులకు తమ రాజీనామాను ఆమోదించాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను’’ అని రాసి ఉన్న లేఖలను నేతలు విడివిడిగా సభాపతికి అందజేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
‘అలా జరిగితే, కచ్చితంగా వైఎస్ జగనే సీఎం’
సాక్షి, గుంటూరు : రాజీనామా అనే పదం చాలా చిన్నది కానీ, దాని పర్యవసానం చాలా పెద్దదని వైఎస్సార్ సీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రజల కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని ఆర్కే గుర్తుచేశారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా రాజీనామా చేసిన ఎంపీలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. 2014లో తన ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ నేతలు ఎంత దారుణాలకు పాల్పడ్డారో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. నాలుగుసార్లు రీ కౌంటింగ్ చేయించినా తానే గెలిచానని, ప్రజల మద్దతు వల్లే తన విజయం సాధ్యమైందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు గట్టిగా నిలబడటం వల్ల ఫలితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకే ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి 175 నియోజక వర్గాల్లో ఉంటే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు ఏజెంట్లను కొనడం కష్టమేమీ కాదని ఎద్దేవా చేశారు. అలాంటి కుయుక్తులను ఎదుర్కొనేలా మనం వ్యవహరించాలంటూ ఎమ్మెల్యే ఆర్కే పిలుపునిచ్చారు. -
ఎంపీల రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయి..
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కవురు శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ప్రజాప్రయోజనాల కోసం పోరాటం చేయటం అంటే ఇదేనని పేర్కొన్నారు. ‘ ప్రత్యేక హోదా కోసం, మాట నిలుపుకోవడం కోసం పదవులనే తృణపాయంగా వదులుకున్న వైఎస్సార్ సీపీ ఎంపీల స్పూర్తికి యావత్ తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. నిజమైన రాజకీయ యోధులని నిరూపించిన మన ఎంపీల నిరసన జ్వాలకు కేంద్రం దిగివచ్చే రోజు అతిదగ్గరలోనే ఉందని’ శ్రీనివాస్ తెలిపారు. సమర్థుడైన నాయకుడి దిశానిర్దేశంలో యుద్ధం చేసే ప్రతి సైనికుడు విజయం సాధస్తాడన్నారు. జగనన్న నడిపించారు.. మన పార్టీ ఎంపీలు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ స్పూర్తి కొనసాగిద్దాం.. కొత్త చరిత్రను లిఖిస్తూ హోదాను సాధించి తీరుదామని వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాస్ పిలుపునిచ్చారు. -
స్పీకర్‌కు మరోసారి వైఎస్సార్ సీపీ ఎంపీల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరోసారి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని లేఖలో మరోసారి స్పీకర్‌ను కోరారు. ‘గత నెల 29న రాజీనామాలపై పురాలోచన చేయాలని మీరు కోరారు.. మీ సలహాకు ధన్యవాదాలు. కానీ, మేం రాజీనామాలకే కట్టుబడి ఉన్నాం. 16వ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాం. తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి’ అని లేఖలో వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఈ మేరకు తమ రాజీనామాలను మరోసారి ధ్రువీకరిస్తూ.. ఎంపీలు స్పీకర్ కార్యాలయంలో ఎంపీలు లేఖలు అందంజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ మహాజన్‌ను గట్టిగా కోరారు. రాజీనామాల ఆమోదానికి ఎంపీలు పట్టుబట్టడంతో ఆమె అంగీకరించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తాము పదవులకు రాజీనామా చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామాల ఆమోదంపై తుది నిర్ణయం ఇదేనా అని స్పీకర్ అడిగితే.. అవునని ఆమె సమాధానం చెప్పారని, రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు తెలిపారని వివరించారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పీకర్‌కు వివరించినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై నేటి సాయంత్రం లోగా అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ తమ రాజీనామాలు ఆమోదించడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాలని ఆమె సూచించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామాల ఆమోదానికి ఆమె ఒకే చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయించిన ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరినట్లు మేకపాటి వివరించారు. రాజీనామాల ఆమోదానికి సంబంధించి సాయంత్రం అధికారిక వెలువడనుందని తెలిపారు. రాజీనామా చేయించి మరీ.. : వరప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబుకు డ్రామాలాడటం తప్పా ఏమీ తెలియదంటూ ఎంపీ వరప్రసాద్ ఎద్దేవా చేశారు. ఏనాడు కూడా హోదా కావాలని కేంద్రాన్ని చంద్రబాబు అడగలేదన్నారు. ఎన్నికలంటే భయం లేదని చెప్పుకునే చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. నంద్యాల ఉప ఎన్నికలో అవినీతి డబ్బుతో గెలిచారని ఆరోపించారు. ఇతరుల పార్టీ నుంచి నేతలు వస్తే.. రాజీనామాలు చేయించి మరీ పార్టీలో చేర్పించుకున్న చరిత్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమన్నారు. ఉప ఎన్నికలకు వెళ్తాం : వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజీనామాలు చేశామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ డ్రామాలు చేస్తోందని, ఏపీ ప్రజలకు ఈ విషయం పూర్తిగా అర్థమైందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు. కమిటీ ఛైర్మన్‌తో మాట్లాడానని స్పీకర్ తమకు చెప్పినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పాలన చంద్రబాబుదేనని, అబద్ధాల పునాదుల మీద చంద్రబాబు అధికారం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. లోక్‌సభలో అసభ్యంగా ప్రవర్తించింది టీడీపీ ఎంపీలేనన్న వరప్రసాద్.. హోదా కోసం వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. తొలుత నోటీసులిచ్చాం : మిథున్‌రెడ్డి అవిశ్వాస తీర్మానంపై నోటీసులు తొలుత ఇచ్చింది, ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది తమ పార్టీనేనని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. హోదా కోసం ప్రజలతో కలిసి పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామన్నారు. సంజీవని లాంటి హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. విలువు అమ్ముకుని బాబు రాజకీయాలు : వైఎస్ అవినాష్‌రెడ్డి రోజుకో ప్రకటనతో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉప ఎన్నికల వస్తే పోటీ చేస్తామంటారని, కానీ ఫిరాయింపు ఎంపీలపై చర్యలు ఎందుకు తీసుకోరని ఈ సందర్భంగా చంద్రబాబును అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి ఉప ఎన్నికలు కొత్త కాదన్న ఆయన.. తాము ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తామని తెలిపారు. చంద్రబాబులాగా విలువలను అమ్ముకుని రాజకీయాలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరినట్లు వివరించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలను ఆమోదించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఎంపీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై పార్లమెంట్ బులెటిన్ ద్వారా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలను కోరిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయంలో మార్పు లేదని వారు తేల్చిచెప్పారు. బుధవారం మరోసారి స్పీకర్‌ను కలిశారు. ఉదయం 11 గంటలకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినా ష్‌రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్పీకర్‌ను ఆమె చాంబర్లో కలిశారు. వీరివెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం.. స్పీకర్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు అరగంటకు పైగా సమావేశమయ్యారు. రాజీనామాలపై మరోసారి పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించగా... తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ సభ్యులు కోరారు. దీనిపై రాతపూర్వకంగా మరోసారి నిర్ణయాన్ని(రీ కన్ఫర్మేషన్) తెలపాలని స్పీకర్ సూచించడంతో ఆ మేరకు ఎంపీలు లేఖలు సమర్పించారు. ‘‘16వ లోక్‌సభ సభ్యత్వానికి నేను 2018 ఏప్రిల్ 6న రాజీనామా చేశాను. ఈ రాజీనామాపై పునరాలోచించాలని మే 29న మీరు(స్పీకర్) సూచించారు. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. నేను ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. నా రాజీనామాను ఆమోదించాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను’’ అని రాసి ఉన్న లేఖలను లోక్‌సభ సభ్యులు విడివిడిగా సభాపతికి అందజేశారు. ‘హోదా’ కోసం పదవీ త్యాగం ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తుదికంటా పోరాటం చేస్తారని, కేంద్రం స్పందించకపోతే వారంతా పదవులకు రాజీనామా చేస్తారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 1న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మార్చి 5న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ పార్టీ తరపున ఎన్డీయే ప్రభుత్వంపై మార్చి 22న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు కుదిస్తారనే వార్తలు రావడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు నిర్ధేశిత తేదీ కంటే ముందుగానే.. మార్చి 15న కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడంతో ఆ తర్వాత వైఎస్సార్సీపీ వరుసగా 13 అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. 12 నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభలో ప్రస్తావించారు. అయితే, సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నందువల్ల వాటిపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్ జగన్ మార్చి 31న స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 వరకూ ప్రత్యేక హోదా కోసం సభలో నినదించిన వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి సమావేశాలు వాయిదా పడగానే నేరుగా స్పీకర్ చాంబర్‌కు వెళ్లి, స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖలను సమర్పించారు. అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వచ్చి అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో తేల్చిచెప్పారు. వారి రాజీనామాల ఆమోదానికి స్పీకర్ తాజాగా అంగీకారం తెలిపారు. -
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
-
‘టీడీపీ డ్రామాలను దేశమంతా చూసింది’
సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌పై మరోసారి ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఐదుగురు వైఎఎస్సార్ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ చేసిన డ్రామాలను దేశమంతా చూసిందని, నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఏం సాధించారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని, హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొదటినుంచీ హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉందని, ఇందుకోసం వైఎస్సార్ సీపీ ఎంపీలందరం ఆమరణ దీక్ష చేశామని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు హేళన చేశారని, తర్వాత యూటర్న్ తీసుకుని టీడీపీ కూడా అవిశ్వాసం పెట్టలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. -
తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి
-
ఐదుకోట్లమంది కోసం ఐదుగురి త్యాగం
ఐదుకోట్లమంది ప్రజల క్షేమం కోసం ఐదుమంది ఎంపీలు చేసిన పదవీ త్యాగం దేశరాజకీయాల్లో సరికొత్త పరిణామంగా ప్రజలు కొనియాడుతున్నారు. లక్ష్య సాధనలో తమ నిబద్ధతను రాజీనామాలతో ప్రదర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీలు చరిత్రాత్మక క్షణాలకు సాక్షీభూతులయ్యారు. ప్రత్యేక హోదా కోసం వారాల తరబడి దేశరాజధానిలో జరుగుతున్న పోరాటం పార్లమెంటు నిరవధిక వాయిదాతో మూలమలుపు తీసుకుంది. శుక్రవారం ఉదయం లోక్‌సభ స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలను సమర్పించిన వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఏపీ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం 2:02 గంటలకు నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఆ ఉద్యమ తీవ్రతను నీరు గార్చడానికి పోటీ యాత్రలు మొదలుపెట్టాలని చూస్తున్నా, ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న నిరాహార దీక్షకు ఏపీలోని 3 ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. ఐదుకోట్లమంది ప్రజల క్షేమం కోసం ఐదుమంది ఎంపీలు చేసిన పదవీ త్యాగం దేశరాజకీయాల్లో సరికొత్త పరిణామంగా ప్రజలు కొనియాడుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించినంతవరకు వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా ఒక చారిత్రక ఘట్టాన్ని తలపించింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ సమయంలో ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా తమ సభ్యత్వాలకు రాజీ నామా సమర్పించిన ఘటన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో అయిదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రయోజనాలకోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన ఘటన ఏపీ చరిత్రలో అపూర్వమనే చెప్పాలి. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు పచ్చమీడియా ఎన్ని విషప్రచారాలు చేసినా, ఎన్ని అభాండాలు మోపినా చివరివరకూ సహించి లక్ష్య సాధనలో తమ నిబద్ధతను రాజీనామాలతో ప్రదర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీలు చరిత్రాత్మక క్షణాలకు సాక్షీభూతులయ్యారు. కానీ ఈ సందర్భంగా కొన్ని అంశాలను నిక్కచ్చిగా బహిర్గతం చేయాల్సిన అవసరముంది. ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్సీపీ అడుగు ముందుకువేసిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం, పచ్చమీడియా సరేసరి... జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనవంతుగా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలను తీవ్ర అనుమానాల్లోకి నెడుతోంది. హోదా ఉద్యమం కీలకఘట్టం చేరుకున్న ఈ తరుణంలో తెలుగుప్రజలు కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో, హోదా సాధన వైపే ప్రజలను నడిపించాల్సిన సమయంలో, ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతునివ్వడానికి బదులుగా ఆ చారిత్రక పోరాటం ప్రాధాన్యాన్ని పలుచన చేసేలా పవన్ వ్యవహరించడం సబబేనా? అనే ప్రశ్న ప్రజల్లో కలుగుతోంది. వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై పోరాడు తున్న ప్రతి సందర్భంలోనూ బాబుకు వత్తాసుగా నిలిచిన పవన్.. ఇప్పుడు వామపక్షాల మద్దతుతో ఉద్యమ శక్తుల మధ్య అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించడం గమనార్హం. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ఎంపీలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిస్తే తాము మద్దతు పలుకుతామని ప్రకటించిన పవన్ తర్వాత వైఎస్ జగన్ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించాక ఉలుకూ పలుకూ లేకుండా మౌనం వహించడంలో మతలబు ఏమిటి? వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన శుక్రవారమే పవన్ విజయవాడలో పాదయాత్రలు చేపట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వైఎస్సార్సీపీ చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటం విలువను తగ్గించే ప్రయత్నంలో వామపక్షాలు కలవడం ఏమిటి అన్నది సామాన్యుడి ప్రశ్న. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు నిజంగా ప్రాధాన్యమిచ్చి ఉంటే కేంద్రానికి ఎదురు నిలిచి ప్రత్యేక హోదాను సాధించడానికి కృషి చేసి ఉండేది. తానే ముందుండి ప్రతిపక్షాలను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేది. కానీ ప్రపంచంలోనే లేని అపురూపమైన రాజధానిని నిర్మించాలనే కలలలోకంలో పరిభ్రమిస్తూ నాలుగేళ్ల కాలాన్ని వృధా చేయడమే కాకుండా హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న వైఎస్సార్సీపీపై లేనిపోని నిందలు వేస్తూ ప్రజలను వంచిస్తోంది. పైగా అభివృద్ధి కేంద్రీకరణ విధానంతో మిగతా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడటం ద్వారా 13 జిల్లాల రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలతో, ప్రజాస్వామ్యంతో ప్రభుత్వాలే చెలగాటమాడటం చాలా ప్రమాదం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. డా. ఎనుగొండ నాగరాజనాయుడు, వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు మొబైల్ : 98663 22172 -
బాబు ఆలోచనలకు ప్రజలే చరమగీతం పాడుతారు
-
టీడీపీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ రాజకీయం చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేయాలని చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం తిరుపతిలో డిమాండ్ చేశారు. తెలుగుదేశంపార్టీ ఎంపీల రాజీనామాను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన వ్యవహారంపై ప్రధానమంత్రి మౌనం వహించడం సరికాదని మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ తిరుపతిలో అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ కేంద్రమంత్రులు స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా చేయాలని కోడెల ఈ సందర్భంగా వారికి సూచించారు. రేపటి నుంచి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కోనకళ్ల నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ... తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరిన ఆమె స్పందించలేదని కోనకళ్ల నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.