
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కవురు శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ప్రజాప్రయోజనాల కోసం పోరాటం చేయటం అంటే ఇదేనని పేర్కొన్నారు. ‘ ప్రత్యేక హోదా కోసం, మాట నిలుపుకోవడం కోసం పదవులనే తృణపాయంగా వదులుకున్న వైఎస్సార్ సీపీ ఎంపీల స్పూర్తికి యావత్ తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. నిజమైన రాజకీయ యోధులని నిరూపించిన మన ఎంపీల నిరసన జ్వాలకు కేంద్రం దిగివచ్చే రోజు అతిదగ్గరలోనే ఉందని’ శ్రీనివాస్ తెలిపారు.
సమర్థుడైన నాయకుడి దిశానిర్దేశంలో యుద్ధం చేసే ప్రతి సైనికుడు విజయం సాధస్తాడన్నారు. జగనన్న నడిపించారు.. మన పార్టీ ఎంపీలు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ స్పూర్తి కొనసాగిద్దాం.. కొత్త చరిత్రను లిఖిస్తూ హోదాను సాధించి తీరుదామని వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment