కేంద్రం నిర్లక్ష్యం వీడాలి | Center Should Not Negligence Ap Special Status | Sakshi
Sakshi News home page

కేంద్రం నిర్లక్ష్యం వీడాలి

Published Thu, Apr 12 2018 12:31 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Center Should Not Negligence Ap Special Status - Sakshi

దీక్షా పరులకు జ్యూస్‌ ఇచ్చి దీక్షను విరమింప జేస్తున్న నాయకులు

కమలాపురం : కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ ఉత్తమారెడ్డి తెలిపారు.  వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు సంఘీభావం తెలుపుతూ స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయం ఎదుట కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి  ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు చేస్తున్న రిలే దీక్షలు బుధవారం ఐదో రోజుకు చేరాయి. కమలాపురం మండలం పందిళ్ల పల్లె మాజీ సర్పంచ్‌ అట్ల సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో డి.వెంకట సుబ్బారెడ్డి, అట్ల ఓబుల్‌రెడ్డి, కె.రెడ్డమ్మగారి సుబ్బిరెడ్డి, పెరుగు లక్ష్మినారాయణ, కొండాయపల్లె యువ నాయకుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, వీఎన్‌ పల్లె మండలం తలపనూరు మాజీ సర్పంచులు చెన్నకేశవరెడ్డి, ఉత్తమారెడ్డి, గంగిరెడ్డి, ఉరుటూరు సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డి, మల్లు శివ, పత్తి భార్గవ్‌ రెడ్డి, సీకే దిన్నె మండల ఈశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంకట రమణ, మల్లేశ్వర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, షాజహాన్, చెన్నూరు మండలం శివాలపల్లెకు చెందిన ఆర్‌.సుబ్బారెడ్డి, పుల్లయ్య, షేక్‌ రహం తుల్లా, పి. ప్రతాప్‌రెడ్డి, పెండ్లిమర్రి మండలం నందిమండలంకు చెందిన శివ, సిద్ధారెడ్డి, సర్పంచ్‌ వెంకటయ్య, గంగిరెడ్డి, మస్తాన్‌ వల్లి తదితరులు దీక్షలు చేపట్టారు.సాయంత్రం వారికి మండల నాయకులు జ్యూస్‌ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వివిధ మండలాల నాయకులు ఎన్‌.కొండారెడ్డి, ఈశ్వరయ్య, ఈశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement