అందరి మద్దతు కూడగట్టింది మేమే: వైవీ | We garnered the support of everyone for No confidence motion | Sakshi
Sakshi News home page

అందరి మద్దతు కూడగట్టింది మేమే: వైవీ

Published Sun, Mar 18 2018 2:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

We garnered the support of everyone for No confidence motion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పట్టువదలకుండా పోరాడుతున్న తాము అన్ని పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతున్నట్లు వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ పార్లమెంట్‌లో నోటీసులు ఇచ్చిన తొలిరోజైన గురువారమే అన్ని పార్టీల నేతలను కలిసినట్లు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

అంతకుముందు నుంచే దీనిపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, అసలు తాము కలిసేంతవరకు టీడీపీ వారు ఎవరినీ కలవలేదని వెల్లడించారు. అన్ని పార్టీలను తొలుత సంప్రదించింది తామేనని, పార్లమెంట్‌ సాక్షిగా ఇది నిరూపణ అయిందని చెప్పారు.  సీఎం చంద్రబాబు అవిశ్వాసానికి మద్ధతు పేరిట డ్రామాలు అడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన నోటీసు మేరకే అన్ని పక్షాల వారూ మద్దతుగా పార్లమెంటులో ఆ రోజు నిలుచున్నారని వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement