
సాక్షి, అమరావతి : రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం హర్షణీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సూచించారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఎంపీలు ముగ్గురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం విదితమే. ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment