v laxman reddy
-
‘దీన్ని కూడా రాజకీయం చేయడం బాబుకే చెల్లింది’
సాక్షి, గుంటూరు: మద్య నిషేధాన్ని స్వాగతించాల్సినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యానికి బానిసలయ్యేలా జనాలను రెచ్చగొడుతున్నారని మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా మారారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢసంకల్సంతో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 20 శాతంపైగా మద్యం వినియోగాన్ని తగ్గించారన్నారు. మద్య వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారు.. కానీ చంద్రబాబు మాత్రం మద్యం తగ్గటంపై బాధపడుతున్నారన్నారు. జనాన్ని తాగుబోతులుగా మార్చాలని చూడటం అనైతికమన్నారు, ప్రస్తుత విధానాలతో ప్రజలు సుఖంగా ఉన్నారని, దీన్ని కూడా రాజకీయంగా చూడటం బాబుకే చెల్లిందని ఆయన విమర్శించారు. ‘చిన్నమెదడు చితికిపోయి యాత్ర చేస్తున్నారు’ -
మద్య నిషేధానికి ప్రజలు సహకరించాలి: లక్ష్మణ్‌రెడ్డి
సాక్షి, విజయనగరం: మద్యానికి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ మద్యం విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి. లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంచెల వారికి మద్యం నిషేధం జరుగుతుందని తెలిపారు. ఇక 20 శాతం మద్యం తగ్గుదలతో ఎన్నో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. మద్యం నిషేధానికి వాలంటీర్ల బాధ్యత కూడా ఉందన్నారు. మద్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఎన్ని చేసిన పక్క రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి, గంజాయి అక్రమ రవాణాలు జరుగుతున్నాయన్నారు. ఇక అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని లక్ష్మణరెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు, రవాణాలు వంటి కార్యకలాపాలు జరిగితే.. ఫీర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నెంబర్ ఎర్పాటు చేశామన్నారు. ఇతర దేశాల మాదిరి హార్డ్ డ్రిక్స్ కాకుండా సాఫ్ట్ డ్రింక్స్ తాగేలా ప్రోత్సహించి మధ్య నిషేధం అమలుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వ్యసనపరులకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు ముస్లిం దేశాలు ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలుచేస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మద్యం నిషేధానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
సన్నబియ్యంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగు: లక్ష్మణ్
సాక్షి, గుంటూరు: ఏపీ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై జనచైతన్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయటం వల్ల ప్రతీ కుటుంబానికి దాదాపు వెయ్యి రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ మంచి పథకమని, అయితే అమలులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పంపిణీ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. -
వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాశనం చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పంచాయతీ వ్యవస్థలను జన్మభూమి కమిటీలతో, దాడులలో చిక్కిన అధికారుల నుంచి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేయడం ద్వారా ఏసీబీని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా స్పీకర్ వ్యవస్థను, స్థానిక సంస్థల సాధికారతకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాజకీయ అవినీతిని తారస్థాయికి చేర్చడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను, తన తాబేదార్లను న్యాయవ్యవస్థలో చొప్పించటం ద్వారా ఆ వ్యవస్థను కూడా కళంకితం చేశారన్నారు. తాజాగా సీబీఐ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2014లో మోదీ ఆకర్షణతో అధికారం పొందిన చంద్రబాబు ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్నారన్నారు. నిప్పులాంటి వాడినని చెప్పుకొనే బాబుకు నిఘా సంస్థలంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్ ఎస్టాబ్లిస్‌మెంట్ చట్టం ప్రకారం హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ఏరాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయవచ్చన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా తాను చేసిన పాపాలపై సీబీఐ విచారణ జరుపుతుందేమోనని సీఎం దానిని అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. -
‘రాజీనామాల ఆమోదం హర్షణీయం’
సాక్షి, అమరావతి : రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం హర్షణీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సూచించారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఎంపీలు ముగ్గురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం విదితమే. ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాకే దీక్ష చేపట్టాలి
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై పలుమార్లు మాట మార్చి ప్రజలను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తూ బుధవారం లక్ష్మణరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి, ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు నిరాహార దీక్షకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. జన చైతన్య వేదిక అడిగిన ప్రశ్నలు.. ప్రత్యేక హోదా కోసం ఏపీ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత కూడా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? ప్రత్యేక హోదా సాధించిన 11 రాష్ట్రాలలో అసలేమాత్రం అభివృధ్ధి జరగలేదని ఆనాడు ఎందుకన్నారు? ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ లభించిందని ప్రజలను ఎందుకు మోసం చేశారు? ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై పి.డి యాక్ట్ ఉపయెగిస్తామని బెదిరించటం న్యాయమా? స్వచ్ఛందంగా ప్రజలు హోదా కోసం పోరాడుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసమే నిరాహార దీక్షకు పూనుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ చంద్రబాబు నాయడుకు పలు ప్రశ్నలతో కూడిన ప్రెస్‌నోట్‌ను జన చైతన్య వేదిక విడుదల చేసింది. -
ఆ రోజున అవతరణ దినోత్సవం చేస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ మార్చడాన్ని పలువురు నేతలు ఖండించారు. నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినంగా కొనసాగించాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం నేత నాగిరెడ్డి, విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు బాధతో ఉన్న రోజును ఏపీ అవతరణ దినోత్సంగా ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 13 జిల్లాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపించాలని సూచించారు. జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ అవరతరణ దినంగా పాటించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.