సాక్షి, విజయనగరం: మద్యానికి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ మద్యం విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి. లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంచెల వారికి మద్యం నిషేధం జరుగుతుందని తెలిపారు. ఇక 20 శాతం మద్యం తగ్గుదలతో ఎన్నో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. మద్యం నిషేధానికి వాలంటీర్ల బాధ్యత కూడా ఉందన్నారు. మద్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ముఖమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఎన్ని చేసిన పక్క రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి, గంజాయి అక్రమ రవాణాలు జరుగుతున్నాయన్నారు.
ఇక అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని లక్ష్మణరెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు, రవాణాలు వంటి కార్యకలాపాలు జరిగితే.. ఫీర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నెంబర్ ఎర్పాటు చేశామన్నారు. ఇతర దేశాల మాదిరి హార్డ్ డ్రిక్స్ కాకుండా సాఫ్ట్ డ్రింక్స్ తాగేలా ప్రోత్సహించి మధ్య నిషేధం అమలుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వ్యసనపరులకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు ముస్లిం దేశాలు ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలుచేస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మద్యం నిషేధానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment