
సాక్షి, గుంటూరు: ఏపీ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై జనచైతన్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయటం వల్ల ప్రతీ కుటుంబానికి దాదాపు వెయ్యి రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ మంచి పథకమని, అయితే అమలులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పంపిణీ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment