janachaitanya vedika
-
‘జార్ఖండ్ అలా చేస్తే.. ఏపీ మాత్రం అందుకు విరుద్ధం’
సాక్షి, గుంటూరు : అభివృద్ధి పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని జనచైతన్య వేదిక సదస్సులో పాల్గొన్న వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయానికి, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని సదస్సులో పాల్గొన్న ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ. 30 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపారని, కానీ ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిదులను ఏపీ పాలకులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర నిధులను విద్య, వైద్యానికి ఖర్చు చేయగా.. ఏపీలో అందుకు విరుద్ధంగా పప్పు బెల్లాలకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఆదాయమో శ్వేత పత్రం విడుదల చేయాలి.. అప్పుచేయటం తప్పుకాదని, కానీ ఎందుకు అప్పులు చేస్తున్నామనే విషయాన్ని పాలకులు గుర్తించాలని సదస్సులో పాల్గొన్న ఆర్థికవేత్త కేసీ రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ స్థితిగతులపై చర్చించడం తప్పుకాదని అన్నారు. 11.5 శాతం వృద్ధిరేటు సాధించామని చెబుతున్న పాలకులు ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో చెప్పాలని, ఏ రంగం మీద ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని స్పష్టం చేశారు. -
జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ సందర్శన
-
గూంటూరులో జనచైతన్య వేధిక అధ్వర్యంలో సదస్సు
-
‘రాజీనామాల ఆమోదం హర్షణీయం’
సాక్షి, అమరావతి : రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం హర్షణీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సూచించారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఎంపీలు ముగ్గురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం విదితమే. ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన స్పీకర్ను కోరారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. -
'ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఈసీకే ఇవ్వాలి'
తిరుపతి: పార్టీ ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఎన్నికల సంఘానికే ఇవ్వాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసమేనని అన్నారు. ఆదివారం తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు హాల్లో జనచైతన్య వేదిక నేతృత్వంలో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' పేరిట ప్రత్యేక చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణకు పూనుకోవాలని కోరారు. కాగా, ఈ చర్చాగోష్టి కార్యక్రమానికి మేధావులు, ప్రజాసంఘాలు తదితరులు హాజరయ్యారు. -
రాజధాని కోసం పంట పొలాల విధ్వంసం తగదు
* జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తిరుపతి: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పంటల పొలాల విధ్వంసం తగదని, ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం చేపట్టాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ఏపీ రాజధాని-భూసేకరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వుహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు నష్టపోయే వైనాన్ని వివరించారు. భూసమీకరణ ద్వారా కాకుండా భూసేకరణ చట్టం-2013ను అనుసరించి రాజధాని ఏర్పాటు జరగాలన్నారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేలాది ఎకరాలు దోచిపెట్టే భూయజ్ఞాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పంట భూములను ధ్వంసంచేసి రాజధానిని నిర్మించే ప్రయత్నం క్షంతవ్యం కాదన్నారు. -
సమైక్య ఐక్యవేదిక సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
సమైక్యాంధ్రకు మద్దతుగా కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమావేశానికి అనుమతి లేదంటూ రౌండ్ టేబుల్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా సమైక్య ఐక్యవేదిక నిర్వాహకులు జనచైతన్యవేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, హర్షవర్థనరెడ్డి, గౌతం, చల్లా మధుసూధనరెడ్డిలను మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దాంతో ఆ సభకు విచ్చేసిన అధికమంది సమైక్యవాదులు నిరాసనతో వెనక్కిమళ్లాల్సి వచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు, న్యాయవాదులు మంగళవారం కూకట్పల్లిలో సమైక్య ఐక్య వేదిక ఏర్పాటు చేశారు.