'ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఈసీకే ఇవ్వాలి' | Laxman reddy demands to give charge election commission on party defections | Sakshi
Sakshi News home page

'ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఈసీకే ఇవ్వాలి'

Published Sun, Jul 3 2016 5:52 PM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

Laxman reddy demands to give charge election commission on party defections

తిరుపతి: పార్టీ ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఎన్నికల సంఘానికే ఇవ్వాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసమేనని అన్నారు. ఆదివారం తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్సు హాల్లో జనచైతన్య వేదిక నేతృత్వంలో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' పేరిట ప్రత్యేక చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణకు పూనుకోవాలని కోరారు. కాగా, ఈ చర్చాగోష్టి కార్యక్రమానికి మేధావులు, ప్రజాసంఘాలు తదితరులు హాజరయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement