Jana Chaitanya Vedika
-
రాష్ట్రాభివృద్ధికి బంగారు బాట
సాక్షి, అమరావతి: సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తోందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ రెండేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఆయన ఏడాదిలోపే అమలుచేసి చూపించారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆదర్శవంతమైన వ్యవస్థను నెలకొల్పారని తెలిపారు. తద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యంతో సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధికి బంగారుబాట వేస్తున్నారని కొనియాడారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘రెండేళ్ల సీఎం జగన్ పరిపాలన – రాష్ట్ర ప్రగతి’పై ఆదివారం వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే.. ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం చేరువ వైద్య రంగానికి సీఎం జగన్ వచ్చాక కేటాయింపులు పెంచారు. కేంద్ర బడ్జెట్లో వైద్యానికి కేవలం 2 శాతం ఖర్చు చేస్తుండగా ఏపీలో సీఎం జగన్ ఆరు శాతం ఖర్చుచేస్తున్నారు. ఆరోగ్యశ్రీని విస్తృతం చేయడం ద్వారా పేద ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశారు. – జి.శంకరరావు, ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్ స్టడీస్ ట్రెజరర్ స్వర్ణాంధ్రప్రదేశ్‌కు బీజం సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం చేరువైంది. దేశవ్యాప్తంగా దీనిని అమలుచేయాలన్నంతగా గుర్తింపు పొందింది. కోవిడ్ కాలంలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో మేలు చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్కి సీఎం జగన్‌తో బీజం పడింది. – వారణాసి మల్లిక్,హైకోర్టు న్యాయవాది రాష్ట్రానికి సీఎం బంగారు బాట సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే సీఎం జగన్ దూరదృష్టితో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ప్రొడక్టివిటి పెరుగుతుంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో రాష్ట్రానికి బంగారు బాట వేస్తాయని అభిప్రాయపడ్డారు. – ప్రొ. వెంకటరెడ్డి, ఆర్థికవేత్త నగదు బదిలీలో సామాజిక న్యాయం ప్రజల ముంగిటకు సుపరిపాలనను తీసుకెళ్లిన తొలి సీఎం జగన్. కరోనా నేపథ్యంలో ఆరి్థక మాంద్యంలో ప్రజలకు నగదు బదిలీ చేయడాన్ని ఒక రకమైన సామాజిక న్యాయంగా భావించాలి. పాదయాత్ర ద్వారా ప్రజల గుండెచప్పుడు అర్ధం చేసుకున్న పరిశోధకుడుగా పథకాలు అమలుచేస్తున్నారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఘనత సీఎం జగన్‌దే. – ప్రొ.హెచ్. లజపతిరాయ్,అంబేడ్కర్ వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ నగదు బదిలీ దేశంలో ఓ రికార్డు కరోనా సమయంలో ఇంత భారీగా నగదు బదిలీ జరగడం దేశ చరిత్రలో ఒక రికార్డు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా అవినీతికి తావులేకుండా పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళ్తున్నారు. కరోనా కాలంలో సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడంవల్ల ఆరి్థక ఇబ్బందులు, ఆత్మహత్యలు లేకుండా ఏపీ ముందుకెళ్లడానికి సీఎం ప్రవేశపెట్టిన పథకాలు ఉపయోగపడ్డాయి. – వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుచేసి వాటి ద్వారా గ్రామీణ ప్రజలకు భరోసా కల్పిస్తోంది. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. ఏపీలో కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు -
వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
-
‘శాసన మండలి రద్దు ను స్వాగతిస్తున్నాం’
సాక్షి, అమరావతి : ప్రజల తీర్పును తిరస్కరిస్తూ పెద్దల కనుసన్నలలో నడుస్తున్న శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని జనచైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాసన మండలి రద్దు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ‘భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే కొనసాగుతున్న శాసనమండలి వ్యవస్థ వలన ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 60 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది. 50 శాతం ప్రజలు ఓట్లతో 154 మంది శాసనసభ్యులు బలపరిచిన పలు ప్రజా ఉపయోగ బిల్లులకు శాసనమండలి అడ్డుకట్ట వేయడం దుర్మార్గం. రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన శాసనమండలిని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు గతంలోనే చరమగీతం పాడాయి. మేధావులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం కోసం ఏర్పడిన పెద్దల సభ ఆచరణలో గ్యాలరీ లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నడిచే విధంగా మారటం శాసన మండలి డొల్లతనానికి నిదర్శనం. ఆచరణలో ఆరొవ వేలుగా మిగిలిన శాసనమండలిని చరమగీతం పాడటాన్ని హర్షిస్తున్నాం’ అని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. -
మద్యపాన నియంత్రణలో ప్రభుత్వం భేష్
గుంటూరు ఎడ్యుకేషన్: కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భేష్ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య తెలిపారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. మద్యపాన నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ మహత్తరమైన చర్యలు చేపడుతున్నారన్నారు. వ్యాపారమయంగా మారిన పాఠశాల విద్యను ప్రక్షాళన చేసేందుకు రెగ్యులేటరీ కమిషన్‌తో పాటు తన అధ్యక్షతన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వేశారని చెప్పారు. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో అతి ముఖ్యమైన మద్యపాన నియంత్రణపైనే మిగిలిన అన్ని పథకాల అమలు ఆధారపడి ఉందని అన్నారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ తీసుకువచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ మద్యానికి బానిసలుగా మారడంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్న పరిస్థితులను చూసిన సీఎం మద్యపాన నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. -
జనసేన వక్రభాష్యాలు భావ్యం కాదు..
సాక్షి, విజయవాడ: మంచి పనిని స్వాగతించక పోగా.. వక్రభాష్యాలు చెప్పటం భావ్యం కాదని.. జనసేన తీరును జనచైతన్య వేదిక ఎండగట్టింది. వైఎస్సాఆర్సీపీ వంద రోజుల పాలన గురించి జనసేన విడుదల చేసిన నివేదికను జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి తప్పుబట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు జనచైతన్య వేదిక బహిరంగ లేఖ రాసింది. చంద్రబాబు బెల్టుషాపులను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కల్యాణ్‌ను లక్ష్మణ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దశలవారీ మద్య నిషేధం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని లక్ష్మణ్‌రెడ్డి ప్రశంసించారు. పవన్‌కు అభ్యంతరం ఎందుకు? సీఎం వైఎస్ జగన్ బెల్టుషాపుల భరతం పట్టి గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి బాటలు వేశారన్నారు. ‘చంద్రబాబు మద్యం వ్యసనాన్ని జనం చెంతకు చేరిస్తే.. జగన్ ఆ వ్యసనాన్ని దూరం చేస్తున్నారని’ చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందన్నారు. అవినీతిపై విచారణ చేస్తామంటే పవన్ అభ్యంతరం చెప్పటం న్యాయం కాదన్నారు. బిహార్, గుజరాత్, మిజోరాం లలో సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు జరుగుతోందని.. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాలని కోరారు. మద్యపాన నిషేధాన్ని రాజకీయం చేయొద్దు.. మద్యం వల్ల సంసారాలు గుల్ల అవుతున్నాయని.. యువత వ్యసనపరులవుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఇండ్ల సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దశల వారి మద్యనిషేధం, డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాలనుకోవటం శుభ పరిణామంగా పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ దృక్పథం మాని మద్యనిషేధానికి కృషి చేయాలని కోరారు. -
‘సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు’
సాక్షి, విజయవాడ : మద్యపాన నిషేధంపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయంపై జన చైతన్య వేదిక, మద్యపాన నిషేధ పోరాట కమిటీ అధ్యక్షుడు వి లక్ష్మణ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. దశల వారిగా మద్యపానం నిషేధంపై అడుగులు వేస్తున్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. పాఠ్యాంశాల్లో మద్యం దుష్పలితాలను చేర్చాలనే నిర్ణయం హర్షనీయమన్నారు. మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అమలు చెస్తారనే నమ్మకం ప్రజలకు ఉందని, ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల కల్తీ మద్యాన్ని కంట్రోల్ చేయవచ్చన్నారు. మద్యం వలన ఎన్నో కుటంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. ఇప్పటికే 20 శాతం మద్యం షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారని.. రహదారులు, బడి, గుడి సమీపంలో మధ్య షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. -
15 శాతం బోగస్ ఓటర్లు.. ఇంకా ఎన్నికలెందుకు?
ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాది ఓటర్ల జాబితా. ఆ జాబితా..ఎంత స్పష్టంగా, నిజాయితీగా వుంటే...ప్రజాస్వామ్యం అంత వెల్లివిరుస్తుంది. అయితే ఏపీలో ఆ పరిస్థితి ఏ కోశానా కన్పించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బోగస్ ఓట్లు కుప్పకుప్పలుగా కన్పిస్తున్నాయి. అడుగడుగునా లక్షల్లో బోగస్ ఓట్లు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితా...అడ్డగోలు వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ మధ్యనే విడుదలైన ఏపీ ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున చోటు చేసుకున్న అవకతవకలను జన చైతన్య వేదిక బట్టబయలు చేసింది. అక్రమాలను బయటపెట్టింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో అదే పరిస్థితి వుందనే విషయాన్ని లెక్కలతో సహా బయటపెట్టింది. ఓటర్ల జాబితాలో వివిధ రకాలైన అవతవకలను జనచైతన్య వేదిక గుర్తించింది. ఒక వ్యక్తికి ఒకే ఓటర్ కార్డుతో రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి మొత్తం 36,404 ఓట్లు ఉన్నట్లు తేలింది. అలాగే ఒక వ్యక్తి.. వేర్వేరు ఓటర్ కార్డులతో రెండు ఓట్లు కలిగి ఉన్నాడని, ఇలాంటివి మొత్తంగా 82 వేల788 ఓట్లు ఉండగా.. ఒక వ్యక్తి.. వేర్వేరు వయస్సులతో రెండు ఓట్లు కలిగి ఉన్నట్టుగా కూడా తేలింది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 24,928 ఓట్లు ఉన్నట్లు జన చైతన్య వేదిక గుర్తించింది. ఒక వ్యక్తి ఒక ఓటు భర్త పేరుమీద, మరొక ఓటు తండ్రి పేరుమీదా.. రెండేసి ఓట్లు ఉన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 92 వేల 198 ఓట్లు ఉన్నాయి. ఇక ఓటరు పేరును తారుమారు చేసిన ఘటనలు సైతం ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఓట్లు 2 లక్షల 60 వేల 634 ఓట్లు ఉన్నాయి. మరో దారుణం కూడా చోటుచేసుకుంది. ఓటరు పేరు, తండ్రి పేరు ఒకేలా ఉండి ఒకే వ్యక్తికి రెండు ఓట్లు కూడా ఉన్నట్లు తేలింది. ఇలాంటివి ఏకంగా 25 లక్షల 17 వేల 164 ఓట్లు ఉన్నట్లు జనచైతన్య వేదిక వెల్లడించింది. ఇంటి నంబర్ తప్పుగా ఉన్న ఓట్లు.. 3లక్షల 95 వేల 877 ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఒకే ఓటరు ఐడీతో ఏపీలోనూ, తెలంగాణలోనూ ఓట్లు కలిగి ఉన్నవారు మొత్తం 18 లక్షల 50 వేల 511 మంది ఉన్నట్లు స్పష్టమైంది. ఈ విషయంలో స్థానిక యంత్రాంగం, జన్మభూమి కమిటీలు కలిసి పెద్దయెత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు జన చైతన్య వేదిక ప్రతినిధులు ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 26 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు తేలింది. అయితే ఓ అధికారి కొన్ని ఓట్లను తీయించారు. అయినప్పటికీ అక్కడ ఇంకా 7-8 వేల నకిలీ ఓట్లు ఉన్నాయి. భారీగా బోగస్ ఓట్లు ఉన్నట్టు తేలిన నేపథ్యంలో మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ఏపీలో గత ఎన్నికల్లో గెలిచిన పార్టీకి, ఓడిన పార్టీకి మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమేనని గుర్తుచేశారు. అలాంటప్పుడు 15 శాతం నకిలీ ఓటర్లు ఉంటే ఇక ఎన్నికలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవతవకలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ముందే చెప్పిన ‘సాక్షి’.. ఏపీ ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని మొదటినుంచీ ‘సాక్షి’ చెప్తూనే ఉంది. అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించిన వాస్తవాలను కూడా బయటపెట్టింది. వేలమంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. -
‘రాజీనామాల ఆమోదం హర్షణీయం’
సాక్షి, అమరావతి : రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం హర్షణీయమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సూచించారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఎంపీలు ముగ్గురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం విదితమే. ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. -
హోదా కోసం తుది దాకా పోరాడతాం: వైఎస్సార్సీపీ
- జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం - హోదా వచ్చేదాకా పోరాడతాం: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ -బాబుది హోదాను మించిన మేధ: తెలకపల్లి రవి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా రాదని ప్రచారం చేయడంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘విభజన చట్టం- ప్రత్యేక తరగతి హోదా- ప్రత్యేక ప్యాకేజీ’ సదస్సులో ఆమె మాట్లాడారు. హోదా కన్నా ప్యాకేజీయే మిన్న అంటున్న చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి సరెండరై, ప్రజా సంఘాలు, మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నిర్బంధాలు ఎన్ని ఎదురైనా వైఎస్సార్సీపీ మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తుందని, హోదా సాధించేదాకా విశ్రమించబోదని ఆమె స్పష్టం చేశారు. హోదా పోరాటంలో కలిసివచ్చేవారికి ఆహ్వానం పలుకుతామని చెప్పారు. బాబుది హోదాను మించిన మేధ:తెలకపల్లి హోదా ముగిసిన అధ్యాయం అంటూ మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు మౌనమోదీలా వ్యవహరిస్తున్నారని, ‘హోదాను మించిన మేధ బాబుగారిది’అని ఎద్దేవా చేశారు. -
నేడు ‘హోదా’పై జన చైతన్య వేదిక సమావేశం
పాల్గొననున్న రాజకీయ, పాత్రికేయ ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ‘విభజన చట్టం – ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ’ అనే అంశంపై చర్చించనున్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత కె.పార్థసారధి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి, కాంగ్రెస్ నేత ఎన్.తులసిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. -
‘ఫిరాయింపులతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం’
సాధారణ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పార్టీల ఫిరాయింపులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. బలమైన పౌర సమాజం ద్వారా ప్రజలను జాగృతులను చేస్తేనే ఫిరాయింపులను నిరోధించవచ్చని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని తక్షణమే అనర్హులను చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని సూచించారు. -
ఫిరాయింపులపై చట్టసవరణ అత్యవసరం
జన చైతన్యవేదిక సెమినార్లో పలువురు వక్తల సూచన సాక్షి, విజయవాడ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయడం అత్యవసరమని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సెమినార్లో మాట్లాడిన వక్తలు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫిరాయించిన వెంటనే పదవిపై వేటుపడాలని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్ నుంచి ఈసీకి బదిలీ చేసేలా చట్టసవరణ జరగాలని సూచించారు. ‘పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం విజయవాడలోని ఎంబీభవన్‌లో నిర్వహించిన ఈ సెమినార్లో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చ ట్టంలో సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. ఫిరాయింపులపై 1985లో, 2003లో చేసిన రెండు సవరణల్లోనూ లోపాలుండటం వల్ల మరోసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇతర పార్టీలనుంచి గెలిచిన వారిని సీఎం స్వయంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు పార్టీలకతీతంగా వ్యవహరించి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలన్నారు. జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, నాగార్జున వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నాగార్జున వర్సిటీ ఆచార్యుడు అంజిరెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ ఎంసీ దాస్, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
ప్రభుత్వం వ్యాపార ధోరణిలో చూస్తోంది:జనచైతన్య వేదిక
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని ప్రభుత్వం వ్యాపార ధోరణిలో చూస్తోందని జనచైతన్య వేదిక విమర్శించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణి చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జపాన్, సింగపూర్ తో సీఎం చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేసింది. నాగరిక సమాజంలో చంద్రబాబు అనాగరిక పోకడలకు పోతున్నారన్నారని మండిపడింది. -
చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా: సీఆర్
హైదరాబాద్: చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా పట్టుకుందని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. రాజధాని ఏర్పాటుపై ప్రత్యామ్నాయ మార్గాలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. నూజివీడులో 12 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం వచ్చే హెచ్చరికలున్నాయని వెల్లడించారు. ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజధాని పల్లెల్లో పొలాలు తగులబెట్టిన వారిని ఇప్పటివరకు గుర్తించలేదని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఖాకీల నీడలో భూసేకరణ జరుపుతూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. తులసిరెడ్డి, జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి, వి. లక్ష్మణ్ రెడ్డి తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. -
'మంత్రి ప్రత్తిపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో పంట పొలాల్లో మంటలు చెలరేగిన ఘటనలపై పోలీసులు ఓవైపు విచారిస్తుండగా, మరోవైపు దీని వెనుక తమ పాత్ర, వైఎస్ జగన్ ప్రమేయం ఉందనడం అవివేకమని ధ్వజమెత్తారు. మంత్రి క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.