'మంత్రి ప్రత్తిపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి' | laxman reddy demand for prathipati pulla rao apology | Sakshi
Sakshi News home page

'మంత్రి ప్రత్తిపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి'

Published Mon, Dec 29 2014 9:36 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

'మంత్రి ప్రత్తిపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి'

'మంత్రి ప్రత్తిపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి'

హైదరాబాద్: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో పంట పొలాల్లో మంటలు చెలరేగిన ఘటనలపై పోలీసులు ఓవైపు విచారిస్తుండగా, మరోవైపు దీని వెనుక తమ పాత్ర, వైఎస్ జగన్ ప్రమేయం ఉందనడం అవివేకమని ధ్వజమెత్తారు.

మంత్రి క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement