సాక్షి, అమరావతి : ప్రజల తీర్పును తిరస్కరిస్తూ పెద్దల కనుసన్నలలో నడుస్తున్న శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని జనచైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాసన మండలి రద్దు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
‘భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే కొనసాగుతున్న శాసనమండలి వ్యవస్థ వలన ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 60 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది. 50 శాతం ప్రజలు ఓట్లతో 154 మంది శాసనసభ్యులు బలపరిచిన పలు ప్రజా ఉపయోగ బిల్లులకు శాసనమండలి అడ్డుకట్ట వేయడం దుర్మార్గం.
రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన శాసనమండలిని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు గతంలోనే చరమగీతం పాడాయి. మేధావులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం కోసం ఏర్పడిన పెద్దల సభ ఆచరణలో గ్యాలరీ లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నడిచే విధంగా మారటం శాసన మండలి డొల్లతనానికి నిదర్శనం. ఆచరణలో ఆరొవ వేలుగా మిగిలిన శాసనమండలిని చరమగీతం పాడటాన్ని హర్షిస్తున్నాం’ అని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment