సాక్షి, విజయవాడ : మద్యపాన నిషేధంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయంపై జన చైతన్య వేదిక, మద్యపాన నిషేధ పోరాట కమిటీ అధ్యక్షుడు వి లక్ష్మణ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. దశల వారిగా మద్యపానం నిషేధంపై అడుగులు వేస్తున్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. పాఠ్యాంశాల్లో మద్యం దుష్పలితాలను చేర్చాలనే నిర్ణయం హర్షనీయమన్నారు.
మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అమలు చెస్తారనే నమ్మకం ప్రజలకు ఉందని, ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల కల్తీ మద్యాన్ని కంట్రోల్ చేయవచ్చన్నారు. మద్యం వలన ఎన్నో కుటంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. ఇప్పటికే 20 శాతం మద్యం షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారని.. రహదారులు, బడి, గుడి సమీపంలో మధ్య షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment