పాల్గొననున్న రాజకీయ, పాత్రికేయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ‘విభజన చట్టం – ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ’ అనే అంశంపై చర్చించనున్నారు.
జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కె.పార్థసారధి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి, కాంగ్రెస్ నేత ఎన్.తులసిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
నేడు ‘హోదా’పై జన చైతన్య వేదిక సమావేశం
Published Sun, Feb 5 2017 1:38 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement