టీడీపీ లోక్‌సభ విప్‌గా కొనకళ్ల | konakalla elected as TDP Lok Sabha Whip | Sakshi
Sakshi News home page

టీడీపీ లోక్‌సభ విప్‌గా కొనకళ్ల

Published Thu, Jun 5 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

టీడీపీ లోక్‌సభ విప్‌గా కొనకళ్ల

టీడీపీ లోక్‌సభ విప్‌గా కొనకళ్ల

 సాక్షి,  మచిలీపట్నం :  తెలుగుదేశం పార్టీ లోక్‌సభ విప్‌గా బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఎన్నికయ్యారు. బుధవారం తిరుపతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కొనకళ్ల ఎంపికను ప్రకటించారు. బందరు లోక్‌సభనియోజకవర్గం నుంచి రెండో పర్యాయం ఎన్నికైన కొనకళ్లకు కీలకమైన విప్ పదవి రావటంపై ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. గతంలో ఎంపీగా విప్‌గా కొనకళ్ల  పనిచేసిన కొనకళ్ల లోక్‌సభ చివరి సమావేశంలో రాష్ట్ర విభజన విషయంలో ఒత్తిడికి గురై పార్లమెంటులోనే గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
 
 గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన రెండో పర్యాయం మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కోస్తా జిల్లాల్లో బీసీ నేతగా ఎదిగిన కింజరాపు ఎర్రంనాయుడు లేని లోటును భర్తీ చేస్తూ టీడీపీ బీసీ నేత అయిన కొనకళ్లకు ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement